Views:
4

వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలో సెప్టెంబరు 2 దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ సమాధి ఘాట్ వద్ద నివాళులర్పించారు. సమాధిపై పుష్పాలను ఉంచి అంజలి ఘటించిన ఆయన కొద్దిపేపు మౌనంగా ఉండిపోయారు. జగన్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం కూడా సమాధి ఘాట్ వద్దకు హాజరై నివాళులు  అర్పించారు.

వైఎస్సార్సీపీ  గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్‌కుమార్, వారి పిల్లలు రాజారెడ్డి, అంజలి, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, వైఎస్సార్‌ సోదరి విమలమ్మ, వైఎస్‌ జగన్‌ మామగారు డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ,  మరియు కడప, రాజంపేట ఎంపీలు , పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి,  వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, రాయచోటి వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ కొండారెడ్డి మండ్లిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, తదితరులు సమాధి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *