Views:
8

మరీ అభ్యంతరకరంగా ర్యాగింగ్ చేసి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ చేసిన సన్నివేషాలతో తెరకెక్కి విడుదలైన చిత్రం “ అర్జున్ రెడ్డి”పై వి.హనుమంతురావు విమర్శలు చేసారు. యువతను చాలా తప్పుదారి పట్టించేలా ఉందని ఆయన అన్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం గురించి ఆయన మెదటనుంచీ వ్యతిరేఖత తెలుపుతున్న సగతి తెలిసిందే, ఈ సినిమాను నిలిపివేయాలంటూ ఆర్టీసీ బస్సులపై అంటిచిన పోస్టర్లను ఆయన చించేసారు.

విపరీతంగా డ్రగ్స్  తీసుకోవడం ప్రోత్సాహకరంగా చిత్రించారని ఆయన అన్నారు. ఇలాంటి చిత్రాలను ఖడించడినికి బదులు కేటీఆర్ లాంటి నాయకులు సపోర్ట్ చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి చిత్రాలను సపోర్ట్ చేసి యువతకు ఆయన ఏమి చెప్పదల్చుకున్నారని వీహెచ్ ప్రశ్నించారు.  అలాగే ఈ చిత్రంపై అభ్యంతరం తెలుపుతూ సెన్సార్ బోర్డుకు, నగర పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందిచి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *