Views:
4

అవిభక్త కవలలు వీణా వాణి ల మధిరిగానే ఒడిస్సాలో కంధమాల్ జిల్లాలో ఓ రైతు ఇంట్లో  తలలు అతుక్కుని పుట్టిన జగన్నాథ్, బలియాలను చారిత్రాత్మక శస్త్ర చికిస్త చేసి వేరు చేసేందుకు సోమవారం ఆపరేషన్ నిర్వహించనున్నారు. ఈ గొప్ప ప్రయత్నానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)  శ్రీకారం చూడుతోంది. మెదడు నుండి గుండెకు రక్తం చేరవేసే సిరలను పంచుకుని పుట్టిన కవలలను ఇద్దరిలో ఒక్కరిని కాపాడినా అది మంచి ప్రయత్నమే అవుతుంది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనదైనప్పటికీ  సాయశక్తులా  కష్టపడతామని ఎయిమ్స్ వైద్యుల బృందం తెలిపింది.

 

పీడియాట్రిక్ న్యూరో సర్జన్లు, , కార్డియోవాస్క్యులర్‌ సైన్సెస్‌కు చెందిన నిపుణులు, న్యూరో అనస్తీసియా మరియు ప్లాస్టిక్ సర్జరీ లలో బాగా అనుభవం ఉన్న నలబై మండి వైద్యుల బృందం ఈ శస్త్ర చికిస్తలో పాల్గొంటున్నారు. వీరు మాత్రమే కకౌండా విదేశాలనుండి కూడా బాగా అనుభవం ఉన్న ఇద్దరు డాక్టర్లు ఈ చికిత్సలో పాల్గొననున్నారు. ఎన్నో టెస్టులు చేసిన తరువాత పలువురు వైద్యుల పర్యవేక్షణ పూర్తయిన తరువాత ఈ చికిస్త చేయనున్నారు. ఈ చికిస్తకు అయ్యే ఖర్చుకోసం ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఆర్ధిక సహాయం ఇవ్వనుంది. కాంధమాల్ ఎన్మిస్ట్రేషన్ లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేసేందుకు ముందుకొచ్చింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి వైద్య విదానలను సమీక్షించారు. 2.5 కోట్ల మందిలో ఒకరికి ఇలా పుట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఇలా జన్మించిన వారిని వేరు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అత్యాధునిక చికిత్సా అందుబాటులోకి వచ్చిన నేపధ్యం లో  జగన్నాథ్, బలియాలను రక్షించే విధంగా చికిత్సలు జరగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *