Views:
5

నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల ఉత్కంఠ నేపద్యంలో పలువురు రాజకీయ నాయకులూ, మంత్రులూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు. వార్ వన్ సైడ్ అని మాకు ముందే తెలుసునని కొందరు వ్యంగంగా సెటైర్లు వేసారు. ప్రచారం లో విర్రవీగిన నేతలకు ప్రజలు సరైన బుద్ది చెప్పారంటూ మరొకరు అన్నారు.  అభివృద్దే చంద్రబాబు గెలుపుకు కారణమయ్యిందని, మాజీ ఎంపీ సబ్బం హరి చంద్రబాబు ను కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో ఎలా మాట్లాడాలో కూడా తెలియక నోరుపారేసుకున్న నాయకుడికి ప్రజలు బాగా బుద్ది చెప్పారని ఆయన అన్నారు.

ఎన్ని పూజలు చేసినా భూమా బ్రహ్మానందరెడ్డి కి బారీ మెజారిటీ వచ్చిందనీ నాయకత్వం పూజలతో వచ్చేది కాదనీ  మరొక మంత్రి వైసీపీ నేత రోజాను ఉద్దేశించి కూడా సెటైర్లు విసిరారు.. ఆరోపణలు చేసే క్రమంలో కనీసం ఒక్క నిజమైన మాటైన జగన్ మాట్లాడారని మాజీ మంత్రి సబ్బం హరి అన్నారు.  మరో పక్క ఈ ఎన్నికల విజయాన్ని దృష్టిలో పెట్టుకుని కాకినాడలో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయంటూ  విజయనగరం జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో పాల్గొని  మంత్రి ఘంటా శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేసారు.  వైసీపీ రాష్ట్రంలో రాను రాను ప్రతిపక్ష పార్టీగా నిలిచే హోదా కూడా కోల్పోతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *