Views:
6

నంద్యాల ఎన్నికల తరువాత జరగబోయే కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు కూడా సజావుగా జరగాలంటే వీవీప్యాట్ ఉన్న ఓటింగ్ మెషీన్ లను వాడాలని వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించే ఘట్టాలు సైతం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతున్నాయో తెలీని నేపధ్యం లో అన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

లోటస్ పాండ్ లో వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎం ల విషయంలో గతంలో జరిగిన పరిణామాలు గుర్తుచేశారు. చంద్రబాబు పై మాకు నమ్మకం లేదని ఆయన అధికారం కోసం ఎంతకైనా దిగజారే రకం అని అన్నారు. అధికారులను కూడా ఆయన తన స్వార్ధ ప్రయోజనాలకు వాడుకునే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.  ఈ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎం ల ట్యాంపరింగ్ జరగకుండా ఉండాలంటే నంద్యాల ఎన్నికల తరహాలోనే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) ఉన్న యంత్రాలను వాడాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రక్రియలపై కేంద్రం కూడా కొద్దిగా దృష్టి సారించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *