warangal, mgm hospita, baby die
Views:
7

వరంగల్: ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందు.. బతికుండగానే చనిపోయిందంటూ చెప్పడమే కాకుండా డాక్టర్లు ఏకంగా డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. దాంతో తల్లిదండ్రులు శ్రీనివాస్, స్వప్న పాపను స్మశానవాటికకు తీసుకువెళ్లాలను కున్నారు. మార్గమధ్యంలో పాప కదలడంతో వెంటనే వారు పాపను తీసుకుని ఆసుపత్రికి వచ్చారు. వైద్యుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. చిన్నారికి సరైన వైద్యం అందించాల్సిందిపోయి, చనిపోయిందని చెప్పడం పట్ల పలువురు డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *