singam, sreshta tripati, up lady police officer
Views:
8

లక్నో: ఈ ఫొటోలోని మహిళా పోలీస్ అధికారిని గుర్తుపట్టారుగా. ఇటీవల బీజేపీ నేతలకు బుద్ధి చెప్పి, వారిని జైలుకు పంపించి.. అందరితో సింగం అనిపించుకున్న యూపీ పోలీస్ ఆఫీసర్ శ్రేష్టా ఠాకూర్ ఈమె. ఈమెపై బదిలీ వేటు పడింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన స్థానిక బీజేపీ నేతలకు జరిమానా వేశారామె. దాంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వారు చేసిన తప్పేంటో తెలియజెప్పి.. అనవసరంగా ఆందోళనకు దిగినవారిని జైలుకు పంపారు. ఈ వీడియో వైరల్ కావడంతో గర్జించిన సింగం అంటూ ఆమెను అందరూ అభినందించారు. అయితే, కొద్ది రోజులకే ఆమెను బదిలీ చేయడం గమనార్హం. బులంద్ షెహర్ లోని స్యానా సర్కిల్ విధులు నిర్వహిస్తున్న శ్రేష్టాను బహ్రెచ్ కి బదిలీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *