pawan kalyan, renu desai, renu fire
Views:
7

హైదరాబాద్‌: తాను, పవన్‌కల్యాణ్‌ తిరిగి భార్యాభర్తలం కాలేమని రేణూదేశాయ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. కల్యాణ్‌ గారు నాలుగేళ్ల క్రితం ‘ఆనా’ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురు ఉంది. ఆయన వివాహబంధాన్ని.. ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను, కల్యాణ్‌ గారు తిరిగి ఏకం కావాలని మీరు పదేపదే కోరవద్దు. దయచేసి ఒక విషయం మీరంతా అర్థం చేసుకొని ఆమోదించాలి. అదేమిటంటే కల్యాణ్‌గారి భార్య ఆనా.. నేను కాదు’.

‘ఒకటి మాత్రం నిజం. ఆయన నా పిల్లలకు తండ్రి. నేనూ ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కాని మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేం. ఈ సత్యాన్ని నేను మనసా వాచా కర్మణా అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కల్యాణ్‌ దగ్గరికి వెళ్లమని మాటిమాటికీ మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్లడం అసమంజసం, అసాధ్యం, అర్థరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే, ఒత్తిడితో కూడిన కోరికలేవీ మీ వద్ద నుంచి ఎదురుకావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయితీతో మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటూ..’ అని రేణూ దేశాయ్‌ వివరంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *