Views:
51

అవతల ఏదోఉందని
అక్షరాలను పక్షుల్లా
ఎగరేస్తున్నాను

ఇక్కడ లేనివేవో
అక్కడ ఉండే ఉంటాయని
ప్రతి తలపును
ఒలిచి ఒలిచి చూస్తున్నాను

ప్రతిధ్వని నాకవసరం లేదు
ప్రతినాయకుని ప్రభావ మూలం
కనుగొనాలిప్పుడు

కోల్పోయిన వేవో కొలువు దీరేచోటు
సజీవరాగవల్లరుల సమాగమం ఆ చోటు
రుతువుల విరితేనియలు జాలువారే చోటు
మహావృక్షపు నీడన అడివైవెలిసినచోటు ఆ చోటుకు
దారులు కనుగొనాలిప్పూడు

వెనక్కి తిరిగి ఉప్పుస్థంబాలనేం చూస్తాం
చీమలదారిలో
మరోప్రపంచపు ప్రస్థానం దాగుంటే

-మెర్సీ మార్గరెట్

(కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *