khammam murder, sister, brother, murder for job
Views:
6

ఖమ్మం: డబ్బు ముందు అనుబంధాలు, ఆప్యాయతలు దిగదుడుపే అని మరోసారి రుజువు చేసింది నాగమణి అనే మహిళ. సింగరేణిలో వారసత్వంగా వచ్చే ఉద్యోగం కోసం ఏకంగా తమ్ముడినే హతమార్చింది. కావేటి రాములు సింగరేణి కార్మికుడిగా ఆదిలాబాద్‌ జిల్లా శ్రీరాంపూర్‌ స్ధిరపడ్డాడు. రాములుకు ఇద్దరు కుమారులు నాగేశ్వర్‌రావు, వెంకటేశం, కూతురు నాగమణి ఉన్నారు.  పెద్ద కుమారుడు సొంత గ్రామంలో ఉండగా, వెంకటేశం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ భార్య ప్రియాంకతో కలిసి పెద్దపల్లిలో ఉంటున్నాడు. రాములు తన ఉద్యోగ విరమణ అనంతరం పెద్దకొడుకుకు వ్యవసాయ భూమి, చిన్న కొడుకుకు సింగరేణి ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. అప్పటికే భర్తతో విడిపోయి, మల్లేశం అనే వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉంది నాగమణి. వెంకటేశంను చంపేసి, మల్లేశంను పెళ్లి చేసుకుంటే  ఉద్యోగం తన మొగుడికే వస్తుందని నాగమణి భావించింది. దీంతో వెంకటేశంను గతేడాది జనవరి 15న ఇంటికి పిలిచి గొంతు నులిమి చంపేసింది. శవాన్ని పత్తి పాకకు చెందిన చిక్కాల రాయమల్లు  కారులో చామనపల్లి వాగుకు తరలించి, పూడ్చి పెట్టారు. వెంకటేశం భార్య ప్రియాంక ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. ఇటీవల ధర్మారం ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బాబురావు మిస్సింగ్‌ కేసుపై దృష్టి సారించడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *