chiranjeevi the first voter in presidential elections
Views:
7

హైదరాబాద్: తెలుగు చలన చిత్ర రంగంలో చిరంజీవే నెంబర్ వన్. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ లోనూ మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ గా నిలుస్తున్నారు. ఓటింగ్ కోసం మొత్తం రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు, రాష్ట్రాల శాసనసభ్యుల పేర్లను అక్షర క్రమంలో పొందుపర్చి ఎలక్ట్రోరల్ కాలేజి జాబితా విడుదల చేశారు. ఇందులో మొదటి పేరు చిరంజీవిదే. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటరుగా చిరంజీవి ఓటు వేయనున్నారు. అయితే, చివరి పేరుకూడా తెలుగువారిదే కావడం విశేషం. పాండిచ్చేరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లాది కృష్ణారావు చిట్టచివరన 4896వ స్థానంలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *