children education cost india
Views:
7

ముంబై: భారతీయులు తమ పిల్లల చదువు కోసం సగటున రూ.12.22లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఓ సర్వే తేల్చింది. పాఠశాల, యూనివర్సిటీ, ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, ట్రాన్స్ పోర్ట్, వసతి.. అన్నీ కలిపితే ఇంత ఖర్చు అవుతోందని హెచ్‌ఎస్‌బీసీ ‘హైయర్‌ అండ్‌ హైయర్‌’ పేరుతో నిర్వహించిన సర్వే చెబుతోంది. ఈ సర్వేను దాదాపు 15 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిపారు. ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఈజిప్టు, ఫ్రాన్స్‌, హాంకాంగ్‌, భారత్‌, ఇండోనేషియా, మలేషియా, మెక్సికో, సింగపూర్‌, తైవాన్‌, యూఏఈ, యూకే, అమెరికా దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. దాదాపు 8,481 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారు. 15 దేశాల సర్వేలో భారత్‌ 13వ స్థానంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *