acid attack, married women gang raped,
Views:
7

లక్నో: 9 ఏళ్ల క్రితం అత్యాచారానికి గురైన ఓ వివాహితపై దుండగులు నాలుగో సారి యాసిడ్‌ దాడి చేశారు. 2008లో ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత 2011, 2013లో ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది. అప్పటినుంచి ఆమె అలిగంజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ యాసిడ్‌ దాడి బాధితుల కోసం ఏర్పాటు చేసిన స్థావరంలో పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చిలో రైలులో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమెపై మళ్లీ యాసిడ్‌ దాడి చేశారు. వెంటనే స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆమెను హాస్పిటల్‌లో పరామర్శించి, పరిహారం అందజేశారు. యాసిడ్‌ దాడికి పాల్పడినవారిని అరెస్ట్‌ చేశారు. కాగా, శనివారం రాత్రి 8 గంటల సమయంలో నీళ్లు పట్టుకోవడానికి ఆమె బయటికి వచ్చినప్పుడు బైక్‌పై వచ్చి యాసిడ్‌ పోసి పరారయ్యారు. దాంతో ఆమె కుడి వైపు ముఖం పూర్తిగా కాలిపోయింది. గతంలో అత్యాచారం చేసిన నిందితులే ఆమెపై యాసిడ్‌ దాడులకు పాల్పడుతున్నారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *