Views:
7

శాన్‌ఫ్రాన్సిస్కో: కాసేపు బ్రౌజ్ చేస్తేనే డేటా అయిపోతోందని తల పట్టుకుంటున్నారా? ఉచిత వైఫై అందుబాటులో ఆ సమస్యే ఉండదు. కానీ, ఉచిత వైఫై ఎక్కడుందో ఎలా తెలుస్తుందనేగా మీ సందేహం. అందుకే మీరు ఎప్పుడూ వాడే ఫేస్ బుక్ ఉపయోగపడుతుంది.   ఫేస్ బుక్ లోని ఫైన్డ్ వైఫై ఫీచర్ ద్వారా ఉచిత వైఫై సదుపాయం ఎక్కడ ఉందో ఎంచక్కా మీకు ఫేస్‌బుకే చెప్పేస్తోంది. దీని ద్వారా ఉచిత వైఫైను యూజర్లు వాడుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్‌ ఎంపికచేసిన దేశాల్లో గతేడాది నుంచి అందుబాటులో ఉంది.

ప్రస్తుతం దీన్ని పంచవ్యాప్తంగా అందరికీ అంటే ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లందరికీ  అందించడం ప్రారంభించింది ఫేస్‌బుక్‌. ” ఫైన్డ్ వైఫై” ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఎక్కడెక్కడ వైఫై హాట్‌ స్పాట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చని ఫేస్‌బుక్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ అలెక్స్‌ హిమెల్‌ చెప్పారు. డేటా కనెక్షన్‌ బలహీనంగా ఉన్నప్పుడు వెంటనే దగ్గర్లోని ఉచిత వైఫై కనెక్షన్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని అలెక్స్‌పేర్కొన్నారు. ఫైండ్‌ వైఫై హాట్‌స్పాట్ల కోసం ఫేస్‌బుక్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, ”మోర్‌” ట్యాబ్‌ను క్లిక్‌చేస్తే, ”ఫైన్డ్ వైఫై”ఫీచర్‌ కనిపిస్తోంది. దాన్ని ఆన్‌ చేసుకుంటే చాలు, మ్యాప్‌లో దగ్గర్లోని హాట్‌స్పాట్లు కనిపిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *