Views:
9

దేశాధినేతల పరస్పర ట్వీట్ల వల్ల స్నేహం బలపడింది. ఘన స్వాగతం లభించింది. మోదీ నా నిజమయిన ప్రియ మిత్రుడు అతని రాకకోసం ఎదురుచూస్తున్నా అని ట్రంప్ ట్రంప్ ట్వీట్ చేస్తే .. కలిసి మాట్లాడడానికి నా మనసు ఉవ్విళ్ళురుతుంది అని మోదీ రీ ట్వీట్ చేసారు.


మోదీ ఆదివారం అమెరికాలో అడుగుపెట్టారు. వాషింగ్టన్‌ డీసీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య మరింత బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాడతాయని అక్కడి సీనియర్‌ అధికారులు కొందరు భావిస్తున్నారు. వాణిజ్య సంబంధం, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైన విషయాలు వీరి భేటీలో చర్చకు రానున్నాయి. హెచ్‌1 బీ వీసా అంశంపై భారత్‌ అభ్యర్థిస్తే ఆ అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా ప్రభుత్వం సానుకూల సంకేతాలు పంపించింది.

తనకు హార్థిక స్వాగతం పలికినందుకు ట్రంప్‌కు మోదీ ధన్యావాదాలు తెలిపారు. ట్రంప్‌తో సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ట్రంప్‌తో మోదీ భేటీకానున్నారు. మరోవైపు ప్రవాస భారతీయులు కూడా మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. విలార్డ్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌లో ఆయనను ప్రవాస గుజరాతీయులు కలిశారు.

మూలం : Tnlive

-రమణి రాచపూడి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *