Views:
19

భారతదేశంలోనే భిన్నమతాలు కులాలు అని సమైక్యంగా ఉందామని, అభ్యుదయం మన మంచి మనసులని చూపుతుందని ఇలా ఎన్నో ఎన్నేన్నే….మార్పులు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఉదయం లేచి ఫేస్ బుక్ తెరిచి చూసామా…. అన్నీ అభ్యుదయ భావాలు, నీతివాక్యాలు మనకి గుడ్ మార్నింగ్ చెప్తూ మేలుకోల్పుతూ ఉంటాయి. సరే భారత దేశాన్ని మనం ఒక పక్కన ఉంచితే.. అమెరికా..
ట్రంప్ ఇక్కడ మతసామరస్యం అంటూ ఏమి లేకుండా గత మార్చిలో జారీచేసిన వివాదస్పదమైన ట్రావెల్ బ్యాన్ తెలిసిందే. ఆరు ముస్లిం దేశాల వలస ప్రజలను తమ దేశంలోకి రాకుండా ఈ నిషేధం విధించారు. ఈ వివాదస్పద నిర్ణయాన్ని సిలికాన్ వ్యాలీ దిగ్గజాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ నుంచి ఎలోన్ మస్క్ అందరూ దీనిపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈ నిషేధం స్టేటస్ క్వోలో ఉంది. అంతే కాకుండా ఫేస్ బుక్ దిగ్గజం సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఈ వివాదస్పద నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ట్రంప్ కు ఝలకిచ్చేలా శరణార్థులకు మద్దతుగా నిలిచేలా సోమాలియా శరణార్థులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. జుకర్ బర్గ్ పాల్గొన్న తొలి ఇఫ్తార్ విందు ఇదే.
అయితే ఆతను అక్కడితో సరిపెట్టలేదు.. ఇఫ్తార్ విందులో వారితో షేర్ చేసుకున్న మధురమైన క్షణాల ఫోటోను జుకర్ బర్గ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రతి ఒక్కరి హృదయాల్ని కదలించే పోస్టుతో పాటు షేర్ చేసిన పై  ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

“ఏమీ తెలియని ఓ కొత్త ప్రదేశంలో, కొత్త జీవితం ఏర్పాటుచేసుకోవడానికి మీరు చూపిస్తున్న తెగువ, నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఎందుకు ఈ దేశం ఎంతో గొప్పదైనదీ అంటే మీరే దానికి శక్తి’‘ అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

అలాగే అసలు ఇల్లు అనే పదానికి అర్థం చెప్పమంటే ఎన్నో ఏళ్ళుగా అక్కడ శరణార్థిగా ఉంటున్న ముస్లిం ఒకరు ఎక్కడయితే నాకు నా ఇష్టం వచ్చిన పని చేయడానికి స్వేచ్చా  స్వంత్రంతం  ఉంటాయో అదే నా ఇల్లు…. ” అమెరికా నా ఇల్లు అని సమాధానం ఇచ్చిన తీరుకు బర్గ్ బట్టర్ లా కరిగిపోయారట. పుట్టిన దేశాము, ఆశ్రయమిచ్చి తమ భావాలని స్వేచ్చగా వేలువర్చగలిగే అవకాశం ఇచ్చిన దేశం రెంటిని ఎప్పటికి మరిచిపోకూడదని శరణార్థి అన్న మాటలు తనని ఆనందంలో ముంచెత్తాయని ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పుకొచ్చారు జుకర్ బర్గ్… ఇదిగో మీరు చూడండి ఆ పోస్ట్..

జూకర్ బర్గ్ ఫేస్ బుక్ పోస్ట్ 

మూలం: సాక్షి

  • రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *