Views:
17

నిజామాబాద్ జిల్లా మాచిరెడ్డి మండలం రెడ్డిపేట్ తండాకు చెందిన సేవ్య రోత్సవం  ఏప్రిల్ నెలలో బెహ్రెయిన్‌లోని నస్ సంస్థలో కార్మికుడిగా జేరాడు. ఈ నెల 12న అతను గుండెపోటుతో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని బంధువులు కిషన్, బాలుల విజ్ఞప్తి మేరకు ఎన్నారై టీఆరెస్ సెల్ బహరేన్ అధ్యక్షుడు సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టిలు భారత్ తరలించారు. అది శనివారం ఉదయం 5గంటలకు సంషాబాద్ చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు ప్రశాంత్, రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, సదనంద్, గంగాధర్, సంజీవ్, దేవన్న, విజయ్, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, తదితరులు సమన్వయం అందించారు.

Source: TN live

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *