Views:
13

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్(52) రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ, ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన భరత్, తెలుగు సిసీ ప్రేక్షకులకు సుపరిచితుడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది.

మూలం: 60 సెకండ్స్

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *