chidambaram son karthi fled to london
Views:
7

లండన్: అదీ సంగతి… నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటూ ఒకపక్క ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్కామ్, పీటర్ ముఖర్జియాకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇప్పించి లంచాలు తీసుకున్నారన్న కేసులో ఆరోపణలు ఉన్నాయని సీబీఐ దాడులు చేస్తుంటే… కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం లండన్ చెక్కేశారు.

చిదంబరం కుమారుడు
karthichidambaram

ఆయన గురువారం లండన్ వెళ్లిపోయినట్లు చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు ధ్రువీకరించారు. అతని పాస్ పోర్టుపై ఆంక్షలేమీ లేకపోవడంతోనే ఆపలేకపోయామని తెలిపారు. ఇక తాజాగా కార్తీపై ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐబీపీ క్లియరెన్స్ ఇప్పించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కేసు విచారణలో భాగంగా మూడు రోజుల క్రితం ఆయన ఇంటిలో సోదాలు కూడా జరిగాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతుంది.

అయితే ఈ నేపథ్యంలోనే ఆయన లండన్‌కు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కార్తి చిదంబరం వ్యవహారం విజయ్ మాల్యా వ్యవహారాన్ని తలపిస్తోంది. కార్తి ఎందుకు లండన్ వెళ్లారన్న విషయమై ఆయన తండ్రి చిదంబరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి :  దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన బాగ్గేజ్ ఆపరేషన్

 

source: telugu24X7

రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *