Views:
8

వివాహాలు స్వర్గంలో నిశ్చయింపబడతాయి. తెలుగింటి వాకిట మండపంలో నిర్వహింపబడతాయనేది జగద్విదితం. కానీ ప్రవాసంలో నివాసం వెదుక్కుంటూ విదేశాలకు ఎగిరిపోయిన స్వదేశీ ప్రేమికులు ప్రస్తుతం ఓ సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. తమ వివాహాలు స్వర్గంలోనే నిశ్చయింపబడ్డాయని నమ్ముతూనే దాని నిర్వహణ మాత్రం తెలుగు నేల నుండి అమెరికాలోని హిందూ దేవాలయాలకు మార్చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-ఆగష్టు నెలల మధ్య ఒక్క అమెరికాలోనే సుమారు 150కుపైగా పెళ్లిళ్లు అమెరికాలోని పలు హిందూ దేవాలయాల్లో జరుగుతున్నాయి.

వీసా కష్టాలకు భయపడి కొందరు, వీసా ఉన్నా కూడా ట్రంప్ మూడ్‌కు భయపడి కొందరూ, సరదా కోసం మరికొందరు ఈ పంథాలో సాగుతున్నారు. ఇదే అదునుగా భావించి వధూవరుల బంధువులు కూడా అమెరికాకు భారీగానే సకుటుంబ సపరివార సమేతంగా తరలివస్తూ పర్యాటక రంగానికి మాంచి ఊపును తీసుకువస్తున్నారు. స్వదేశంలో ఎండాకాలం కావడం, అమెరికాలో వానాకాలం కావడం కూడా వీరి ఆసక్తికి చోదక శక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మండపాల ప్రాంతం మారినా సంస్కృతి-సాంప్రదాయాలకు అనుగుణంగా పెద్దల సమక్షంలో తెలుగువారు ఆనందదాయకంగా వివాహం చేసుకోవడం పట్ల ప్రవాసులు హర్షం వెలిబుచ్చుతున్నారు. నూతన దంపతులు సంతోషమే ప్రధానమంటున్నారు.

-రమణి రాచపూడి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *