Views:
9

చదువు, చదువు, చదువు నేటి తరానికి మనం నేర్పుతున్న ఒకే ఒక పదం. వారి బాల్యాన్ని నిర్దాక్షిణ్యంగా మనం బలి చేసేస్తున్నాము అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఈ 1 2 3 4 5 అనే ర్యాంకుల గణాంకాల వెర్రి మోజులో పిల్లలిని దింపేసి మనం కళ్ళుమూసుకుని పిల్లల గొప్ప ఆంగ్ల మాటలని గొప్పగా చెప్పుకుంటాము. ఇదంతా ఒక ఎత్తు అయితే వారి హోం వర్క్… మనల్ని కూడా నిద్రపోనివ్వకుండా కుస్తీ పడుతూ చేయిస్తారు బండెడు హోం వర్క్.. అన్నీ రాయడమే అయితే ఇక చదవడం ఎప్పుడు వీళ్ళు ఆడుకోవడం ఎప్పుడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు లేవు. సరే ఇలా మనం ఈసురోమంటూ ఆలోచిస్తూ ఉన్నాము కాని లండన్ లో ఏకంగా ఈ పిల్లల ఆలోచనలని పదును అంటూ హోం వర్క్ లోని ఓ అంశాన్ని ఇచ్చారు. అది చూసిన తల్లితండ్రులు ఆ టీచర్ ని చేడా, మడా తిట్టేసారట….. అందరిముందు సారీ కూడా చెప్పించేసారు.

 ఇది బాగానే ఉంది కాని కొంతమంది తల్లితండ్రులు ఇలాంటి మేచ్యురిటీ మంచిదే అని కూడా వాదిస్తున్నారట…మీరు చూడండి అసలేమి జరింగిందో?

బ్రిటన్‌లో ఓ స్కూల్‌ చిన్నారులకు స్కూల్‌ మాత్రం బిత్తరపోయేలా ఆత్మహత్య లేఖను రాసుకొని రావాలని చెప్పింది. ఈ ఘనకార్యం చేసింది ఓ ఆంగ్ల టీచర్‌. మొత్తం 60మంది విద్యార్థులకు ఈ సూసైడ్‌ నోట్‌ డ్రాఫ్ట్‌లను తీసుకురావాలని చెప్పింది. షేక్‌స్పియర్‌ విషాదాంత రచన మ్యాక్‌బెత్‌లో భాగంగా ఈ లేఖ నమునాను తీసుకురావాలని ఆదేశించింది. దీనిపై తల్లిదండ్రులంతా భగ్గుమనడంతో చివరకు ఆమె క్షమాపణలు చెప్పింది. లండన్‌లోని కిడ్‌బ్రోక్‌లో గల థామస్‌ తల్లీస్‌ స్కూల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా, ఇలాంటివి కూడా విద్యార్థులకు అవసరం అని మరికొందరు తల్లిదండ్రులు మద్దతిచ్చారు.

తల్లి తండ్రులుగా  మీరయితే ఏమి చేస్తారు ?

రమణి రాచపూడి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *