Views:
4

భారత దేశం భయపడినదంతా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం లోనే హెచ్1 బి వీసాలపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న అక్రమ నివాసులను త్వరలో ఇంటికి పంపే అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టు కొట్టివేసిన ముస్లిం వలసల నిషేధం డిక్రీని మళ్ళీ మరో రూపంలో జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్ధితుల్లోనూ తాను చెప్పింది చేసి తీరే వైఖరితో అమెరికన్ భారతీయుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు.

ప్రస్తుతానికి హెచ్1 బి వీసా హోల్డర్ల అమెరికా నివాసానికి వచ్చిన భయం ఏమీ లేదు. కానీ అధ్యక్షుడు ట్రంప్ సమీప భవిష్యత్తులో వారిపై కూడా దృష్టి సారించవచ్చని కనీసం కొంతమందిని అయినా వెనక్కి పంపేసే నిర్ణయాలు చేయవచ్చని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 11 మిలియన్ల మందిని అమెరికా నుండి డిపోర్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అందుకు తగిన మార్గదర్శక సూత్రాలను అధ్యక్షుడు ఇప్పటికే జారీ చేశారని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.

మెమో ప్రకారం అక్రమ వలసదారులు కింది కేటగిరీల కిందికి వచ్చినట్లయితే వారిని వెంటనే దేశం నుండి తొలగించే అధికారం హోమ్ ల్యాండ్ సెక్రటరీకి ఉంటుంది. సదరు కేటగిరీలు ఇలా ఉన్నాయి:

అమెరికాలో ప్రవేశార్హత లేనివారు అమెరికాలో ఉండడానికి అనుమతి లేనట్లయితే మరియు పెరోల్ ద్వారా ప్రవేశం లభించనట్లయితే…
ప్రవేశార్హత ఉన్నదీ లెండీ నిర్ణయించడానికి ముందు వరుసగా రెండు సంవత్సరాల పాటు భౌతికంగా అమెరికాలో ఉండనట్లయితే…
అక్రమ విదేశీ వలసదారుడు తల్లిదండ్రులు లేని మైనర్ కానట్లయితే…
రాజకీయ ఆశ్రయం కోరే ఉద్దేశం లేనివారైతే…
తమ సొంత దేశంలో హింస, వేధింపులు ఎదుర్కొంటున్నవారు కాకపొతే…
భారతీయులలో ఇలాంటి వారు ఉండడం చాలా చాలా అరుదు; అమెరికా పౌరసత్వం కోసం ఫోర్జరీ పత్రాలు తయారు చేయకపోతే గనక. కనుక ట్రంప్ దాడి నుండి భారతీయులకు మినహాయింపు దొరకడం కష్టంగా కనిపిస్తోంది.

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *