Views:
5

యోగ దినోత్సవ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో యోగాసనాల నిర్వహణతో పాటు యోగ యొక్క ప్రాధాన్యంపై చర్చలు జరిగాయి. పారిస్‌లోని సుప్రసిద్ద ఈఫిల్‌ టవర్‌, న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌, లండన్‌లోని ట్రఫాల్గర్‌ స్క్వేర్‌, దిల్లీలోని సెంట్రల్‌ పార్క్‌ సహా ప్రదాన కూడళ్లన్నీ మూడో అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాలతో ప్రతిధ్వనించాయి. దిల్లీలో 8చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా… కన్నాట్‌ప్లేస్‌ ప్రధాన వేదిక అయింది . దేశంలోని ప్రతి జిల్లాలోనూ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ ప్రభుత్వ సంస్థలు విడివిడిగానూ, సొంతంగా కార్యక్రమాలను నిర్వహించాయి . జాతీయంగా, అంతర్జాతీయంగా యోగాకు విశేష ప్రాచుర్యం కల్పించటంతో పాటు దాని అభివృద్ధికి పాటుపడిన వ్యక్తులు, సంస్థలకు ఇచ్చే ప్రధానమంత్రి అవార్డును ప్రధానం చేసారు.

దిల్లీ:   నిధుల సంగం (యూజీసీ) ఆదేశించిన నివేదిక ప్రకారం విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో తృతీయ అంతర్జాతీయ యోగ దినోత్సవ నిర్వహణకు సంబంధించిన వీడియోలు, ఫొటోలతో నివేదికలను సమర్పించాయి . దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని యూజీసీ నెలక్రితమే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు సూచించింది. సామూహిక యోగాసనాలతో పాటు యోగ ప్రాధాన్యంపై చర్చలు, ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలనూ నిర్వహించాలని కోరింది. ఈనెల 21న ఆయా కార్యక్రమాలను ఎలా నిర్వహించింది తెలియజేస్తూ సమగ్రనివేదికలను సమర్పించాలని తాజాగా ఆదేశించింది.

లఖ్‌నవూ :    ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..   ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ మోదీ సహా ప్రముఖులు, ఔత్సాహికులు వర్షంలోనే యోగసనాలు వేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యోగా చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మోదీ అభినందనలు తెలిపారు. యోగాతో పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చన్నారు. యోగా సాధన రుషులు, మహర్షుల నుంచి సామాన్యుల వరకు అందరికీ ఉపయోగకరమన్నారు. యోగా వల్ల ప్రపంచమంతా భారత్‌తో మిళితమైందన్నారు. యోగా శిక్షకులకు అద్భుత అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం.. అది యోగా వల్లనే సాధ్యమవుతుందని మోదీ పేర్కొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *