Views:
12

మహారాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం సెల్ఫీ అనేది ఇప్పుడొక నిబంధన. తప్పని సరిగా స్కూల్లో పిల్లలు సెల్ఫీలు దిగాల్సిందేనట. ఒక్కో టీచర్ పదిమంది పిల్లలతో కలిసి సెల్ఫీ తీసుకోవాలి. తర్వాత ఆ పిక్స్‌ను, అందులో కనిపించే విద్యార్థుల పూర్తి వివరాలను మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అపలోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా. వివిధ కారణాలతో అర్థంతరంగా చదువుకోవడం మానేస్తున్న విద్యార్థులను తిరిగి బడిబాట పట్టించేందుకు.. మహాసర్కారు ఈ రకమైన పథకాన్ని రచించింది. దీని ద్వారా బడి మానేస్తున్న విద్యార్థులెవరో, దానికి కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం మొదలెట్టింది. వారి కుటుంబాలు ఒకచోట నుంచి ఇంకో చోటకు, ఇతర రాష్ర్టాలకు తరలి వెళ్లాల్సిరావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని గుర్తించింది. ఇకపై ప్రాంతాలు మారిన విద్యార్థులకు.. కొత్త స్కూల్‌లో అడ్మిషన్ తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు ఎడ్యుకేషన్ గ్యారంటీ కార్డ్స్ మంజూరు చేస్తోంది. వీటిని వాట్సాప్‌లో ఎన్‌రోల్ చేయడం ద్వారా.. కొత్తగా చేరిన స్కూల్‌లో ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. మహారాష్ట్రలో ఇప్పటికే 9 శాతంగా ఉన్న డ్రాపవుట్‌ను మరింతగా తగ్గించేందుకు ఆ రాష్ట్ర సర్కారు ఈ సెల్ఫీ ట్రిక్కును తీసుకొచ్చింది. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

  • రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *