Views:
6

సొషల్ మీడియాలో రోజు జోక్స్ చూస్తూ ఉంటాము. పెళ్ళికొడుకు మెళ్ళో తాళీ కడుతూఉంటే పెళ్ళికూతురు సెల్ఫీలో మునిగితేలుతూ ఉండడం లేదా తాళీకూడా కట్టనివ్వకుండా స్నేహితులతో సెల్ఫీలకి ఫోజులివ్వడం లాంటి హాస్యం మనం కాసేపు సరదాగా నవ్వుకోడానికి మాత్రమే అనుకుంటూ ఉంటాము. కాని, అదే సీరియస్ అయితే కథ విడాకులకి దారి తీస్తుంది. అదే జరిగింది సౌదీలో.

వారిరువురు సోషల్ మీడియా అప్లికేషన్స్ అయిన స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వాటికి దూరంగా ఉండాలంటూ పెళ్లికి ముందు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దీనిపై ఇరు కుటుంబాలు సంతకాలు కూడా చేసుకున్నాయి.

పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది పెద్దలు చెప్పిన మాట. కలవని మనసుల కాపురం కన్నా.. విడిపోయి ఆనందంగా ఉందాం.. అన్నది నేటి తరం అభిప్రాయం. అందుకు ఎంచుకున్న మార్గం విడాకులు. సాధారణంగా పెళ్లయిన కొద్ది కాలం తర్వాత గానీ ఈ విడాకుల అవసరం రాదు. కానీ ఓ యువకుడు పెళ్లయిన రెండు గంటల్లోనే విడాకులకు దరఖాస్తు చేశాడు. సౌదీలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సౌదీ అరేబియాలోని ఓ నగరంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన తర్వాత పెళ్లి కూతురు.. తన ఫోన్ తీసుకుని పెళ్లి ఫోటోలను తన మిత్రులకు షేర్ చేయడంలో మునిగిపోయింది.అయితే పెళ్లయిన నిమిషాల్లోనే భార్య.. అగ్రిమెంట్‌ను కాలరాయడంతో పెళ్లి కొడుకుకు ఆగ్రహం తన్నుకు వచ్చింది. పెళ్లి సంబరాల్లో అంతా మునిగిపోయిన సమయంలోనే మైక్ తీసుకుని.. నా భార్యకు ఇప్పుడే విడాకులు ఇస్తున్నానంటూ ప్రకటించాడు. దీంతో అందరూ హతాశులయ్యారు. అతడికి సర్ది చెప్పాలని ప్రయత్నించినా ఎంతకూ ఫలితం లేకపోయింది. దీంతో ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ మత పెద్ద నిర్ణయాన్ని ప్రకటించాడు. తన చెల్లి బుద్ధిలేని తనం వల్లే ఇదంతా జరిగిందని పెళ్లి కూతురి సోదరుడు వాపోయాడు. కట్టుబాట్లను సరిగా పాటించకుండా ఉండటం వల్లే పెళ్లికొడుకు విడాకులు కావాలని కోరాడని, దానికి తాము అంగీకరించ తప్పలేదని పేర్కొన్నాడు. తస్మాత్ జాగ్రత్త ఎదయినా జరగొచ్చు కోపం వస్తే సర్ధుకుపోవదమనేది కల్ల కలహాలు, విడిపోవడం దాక వస్తుంది దానికి సోషల్ మీడియా కారణం అంటే బంధాలకి విలువలకి వలువలు లాగెస్తున్నామని… వాటిని కాలరాయద్దు.

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *