Views:
11

భారత దేశం అన్నపూర్ణకి పుట్టిల్లు అంటారు, కవచకుండలాలు దానం చేసిన దాన కర్ణుడు, వామనుడికి మూడడుగుల నేల అంటూ దానం చేసిన శిబి చక్రవర్తులను కన్న గొప్ప భరత భూమి ఈ ఖండం.

ఇలాంటి తమ దేశం కోసం తమ వంతు కృషి అంటూ తాము కష్టపడి  సంపాదించిన సొమ్ములో నిధుల రూపేణా , పెట్టుబడుల రూపేణా, డిపాజిట్ల రూపేణా భారదేశానికి బదిలీ చేసి భారత ఆర్థిక అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు  భారత శ్రామిక ప్రవాసులు. ప్రవాస కార్మికుల ద్వారా వచ్చిన నిధులు  భారతదేశం ప్రపంచ బ్యాంక్ ప్రకారం లెక్కించి చూస్తే 2014 లో $70.4 బిలియన్ అందిందని అంచనా వేసారు. భారతదేశం దీనికి గాను ప్రవాసులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అభివృద్ధికి వారివంతు కృషిని కొనియాడింది.

భారతదేశం అందుకున్న నిధులకి  అయిదు అద్భుత నిజాలు/విషయాలు

  1. గత 20 సంవత్సరాలనుండి భారతదేశం ప్రవాసుల నుండి నిధులు స్వీకరిస్తోంది. ఈ విషయంలో ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మని మరియూ మెక్సికో లాంటి దేశాలకన్న భారత దేశం ప్రవాసులనుండి నిధుల స్వీకరణలో మొదటి స్థానంలో ఉంది. మధ్యలో మూడు సార్లు మాత్రమే స్థానభ్రంశం జరిగింది కాని మొదటినుడి విజేత భారతదేశం. ఇది ప్రవాసుల దేశభక్తికి ఒక తార్కాణం. ఈ విషయంలో భారత దేశానికి గట్టి పోటి చైనా , కాని అంచనాలను తారు మారు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రవాసుల దేశభక్తి మొదటి స్థానంలో ఉంచుతోంది. 2015 లో కూడా ఇదే ఆశతో ఆర్థిక అభివృద్ధి పధకాలని చేపడుతోంది భారతదేశం.
  2. విరాళాల నిధికి ప్రతి ఎనిమిదవ డాలర్ భారత దేశం కి చేరుతోంది. : 2014 లో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాకి కి చేరిన భారత నిధి 12.1%. ప్రపంచబ్యాంక్ అంచనా ప్రకారం, 2014 లో $583.4 బిలియన్ ప్రవాసులు వారి వారి స్వదేశాలకి ఫండ్ కోసం పంపించారు. 1975 లో లెక్కల ప్రకారం భారతదేశం 4.5% స్వీకరించింది. $9.5 బిలియన్ ప్రవాసులు వారి స్వదేశాలకు పంపించారు. ఇందులో భారత దేశం అందుకొన్న నిధి $430 మిలియన్.
  3. ఎనారైల ఈ నిధుల కారణంగా భారత దేశ అభివృద్ధి సగటుకన్నా వేగంగా పెరిగింది: భారతదేశం అభివృద్ధి నిధుల స్వీకరణ 1975 నుండి 2014 మధ్య 14% సగటు అభివృద్ధి పెరిగింది. నిధులు అప్పటికి $688 బిలియన్ అందుకుంది. గ్లోబల్ నిధుల సేకరణతో సరిపోల్చితే 11% మాత్రమే పెరిగింది. ఆశాజనక అభివృద్ధి అంటే 1980 లో ముందు సంవత్సరాలతో   పోల్చుకుంటే 92% కి పెరిగిందని చెప్పోచ్చు. అలాగే ప్రపంచ బ్యాక్ అంచనా ప్రకారం 2015 కూడా స్లోగా నడుస్తోందని ఈ సంవత్సరం సరీయిన ప్రోత్సాహకం ఉండదని భావిస్తున్నారు.
  4. పశ్చిమ ఆసియాలో ఈ ఎల్ డోరాడో: 2014 లో భారదేశం అందుకున్న సొమ్ము సగభాగం వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌది అరేబియా వంటి పశ్చిమ ఆసియ నుండే ముఖ్యంగా వర్క్ వీసా 18 తో ఉన్నా ప్రవాస కార్మికుల నుండి అందుతున్నాయి. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ప్రవాస కార్మికులు పంపే సొమ్ము $12.6 బిలియన్ కాగా ఇందులో ఒక్క  సౌది అరెబియానె మూడో స్థానంలో ఉండి $10.8 దాక భారతదేశానికి నిధులు పంపిస్తున్నారు. ఇక 2014 లో కువైట్ ఖతార్, ఓమన్  మరియూ బెహ్రన్ ల నుండి చూసుకుంటే $37 బిలియన్ల వరకు భారతదేశానికి సొమ్ము అందింది.

ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లకన్నా ఎనారై సొమ్ము  నమ్మకమయినది: ఎందుకంటే ఇక్కడ ప్రవాసలు వారి కుటుంబ నిర్వాహణ కి తప్పని సరై డబ్బు పంపించడం జరుగుతుంది. ఈ సొమ్ము కన ఎక్స్చేంజ్ రేట్లు అందుబాటులో ఉంటే పంపించే ప్రక్రియ మరింత ఉదృతం చేసే అవకాశం ఉంటుంది. అలా అభివృద్ధి చెందుతుంది.  అలాగే బ్యాక్ కన్నా ఎనారై డిపాజిట్లకి ఎక్కువ వడ్డి ఇచ్చేట్లయితే వీరు డబ్బు అధికంగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అనుకూల పరిస్థితుల్లో ఎంతయినా పంపవచ్చు కాని ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం లాంటి సమయాల్లో ఎనారైస్ పంపే సొమ్ము పై ప్రభావం చూపిస్తుంది. 2008-09లో ఆర్థిక మాంధ్యం మూలంగా డబ్బు బదిలీ  క్షీణించి 2009 కి 1.5% కి చేరుకుందనే  చెప్పొచ్చు.

ప్రస్తుతం 3 గల్ఫ్ దేశాలనుండి 37$ బిలియన్లు విదేశాలకి పంపి మొదటి 10 స్థానాల్లో గల్ఫ్ దేశం ఉంది. గానాన్కాలని అనుసరించి గల్ఫ్ దేశం నిధులని సరఫరా చేయడంలో అత్యన్నత స్థాయిలో ఉంది.

సేకరణ, అనువాదం  : రమణి రాచపూడి

లింక్ : http://www.indiansinkuwait.com/ShowArticle.aspx?ID=41727&SECTION=0

 

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *