Views:
11

“న్యాయంగా సంపాదించే సొమ్ము ఏదయినా అమ్మలాంటిది, అమ్మ వేలు ఏనాడు వీడకూడదు.” ఎక్కడినుంచో వచ్చాము, ఇక్కడ ఉద్యోగం దొరకదు, తినడానికి తిండి లేక, ఎవరినీ అడగలేక ఎన్నాళ్ళీ కష్టాలు, పిల్లలు చూస్తే పెద్దవాళ్ళయ్యారు. ఈ ఆలోచనలు నన్ను కుదిపేశాయి. గల్ఫ్ దేశాలలో అయితే వ్యభిచారం లేకపోతె ఇళ్ళల్లో యజమానుల చేత హింసతో కూడుకున్న హోం మెయిడ్ ఉద్యోగాలు తప్పితే ఇక వేరే ఉద్యోగాలు లేవా? నేను వంట చెరుకు తయారు చేస్తాను. నా పిల్లలిని అడిగాను వాళ్ళు సరే అమ్మా అన్నారు అందుకే ఇలా రోడ్ పై టీ అమ్మూతూ మర్యాదగా డబ్బు సంపాదించుకుంటున్నా .. అని చెప్పింది ఈ సౌదీ మహిళ జుమన మక్కి. మాదినహ్ లోని కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్ పై టీ విక్రయిస్తూ, రక రాకల సువాసనల కాఫీని కూడా అందజేస్తూ ఉంటుంది ఈ మహిళ. ఈమే వ్యాపారానికి విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈమె ఇద్దరు కూతుళ్ళ సహకారం ఉందని గర్వంగా చెప్తుంది. చదువులయి ఉద్యోగాలకోసం తిరగలేక తాము ఈ వృత్తిని ఎంచుకున్నామని, చిన్నదయినా ఆదాయం బాగానే వస్తోందని తెలిపారు ఈమె కూతుళ్ళు.డబ్బు సంపాదించాలన్న తపన ఉండాలి కాని న్యాయంగా ఎంతయినా ఎలా అయినా సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు ఈ సౌదీ అతివలు. కష్టే ఫలి చేసిన కష్టానికి ప్రతిఫలం ఎప్పటికయినా వస్తుంది అని వీరి ప్రగాఢ విశ్వాసం.

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *