Views:
13

ప్రతి ఒక్క మహిళ ఒక అందమైన, స్వచ్చమైన చర్మం సౌందర్యాన్ని కోరుకుంటుంది. అయితే, చాలా మంది మహిళలు మొటిమలు, డార్క్ సర్కిల్స్ మరియు ఇతర చర్మ సమస్యల భారీన పడుతుంటారు. కొన్ని రకాల చర్మ సమస్యల వెనుక స్కార్స్ మరియు స్పాట్స్ ముఖం మీద దాగి ఉంటాయి. ఇటువంటి చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు, చిట్కాలను అనుసరించి ఉంటాయి. ఇంకా, కొన్ని రకాల క్రీమ్స్ మరియు జెల్స్ వంటివి అప్లై చేసినా కూడా అనుకొన్న ఫలితాలను ఇవ్వలేకపోవడంతో నిరాశ చెందుతుంటారు. కాబట్టి, మీ ముఖ చర్మంలో ఎటువంటి మచ్చలు, మొటిమలు, స్కార్స్ లేకుండా ఒక స్వచ్చమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నించండి. ఈ నేచురల్ రెమెడీస్ వినియోగం వల్ల ఫలితం కొంత ఆలస్యం కావచ్చు. కానీ ఇది శ్వాసత పరిష్కారం ఇస్తుంది. అటువంటి నేచురల్ హోం రెమెడీస్ కేవలం 10రోజుల్లోనే మంచి ఫలితాలను ఇవ్వడానికి సహాయపడుతాయి.

 ఒక స్వచ్చమైన చర్మ సౌదర్యం పొందడానికి చాలా సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా మీరు కొన్ని బేసిక్ టిప్స్ ను అనుసరించాల్సిందే. అప్పుడే మీరు అనుకొన్న ఫలితాలను మీరు గమనించగలరు. ఉదా : మీరు ప్రతి రోజూ నాలుగు సార్లు మీ ముఖంను శుభ్రం చేసుకోవడం వల్ల, చర్మలో మొటిమలు, మచ్చలు, ఏర్పడటానికి కారణం అయ్యే మలినంతో పాటు బ్యాక్టీరియా తొలగిపోతుంది.

అదే విధంగా రోజుకు సరిడా నీళ్ళు త్రాగడం మరియు డిటాక్స్ ఫుడ్స్ తినడం వల్ల కూడా శరీరంలో హార్మ్ ఫుల్ టాక్సిన్స్ ను తొలగించి, ఎటువంటి చర్మ సమస్యలను ఏకుండా ఒక స్వచ్చమైన చర్మ సౌందర్యం ఇస్తుంది.. మీరు తీసుకొనే ఆహారం కూడా మీ ఆరోగ్యం మీద మాత్రమే ప్రభావం చూపకుండా, మీచర్మం మీద కూడా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. కేవలం 10 రోజుల్లో స్వచ్చమైన చర్మసౌందర్యం పొందడానికి సహాయపడుతుంది.

-రమణి రాచపూడి

One thought on “సౌందర్యం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *