Views:
11

వంశాంకురం కోసం దుబాయ్, కువైట్ లకి వెళ్లి, పెళ్లి మీద పెళ్లి చేసుకుని ఆడపిల్లలకి జన్మనిస్తున్న దుర్మార్గుడు

పుత్ర సంతానం కోసం పైశాచికం..తాళిని ఎగతాళి చేస్తున్న దుర్మార్గుడు..కొడుకు కోసం మూడు పెళ్లిళ్లు..ఆడపిల్లలు పుట్టడంతో భార్యలకు విడాకులు..భర్త కోసం దుబాయ్ లో మొదటి భార్య వేట..నాన్నను చూడాలని ఆడపిల్లల ఆరాటం..అమ్మ ఎప్పుడొస్తుందోనని ఆరాటం..

కంటి పాపలా చూసుకోవాల్సిన ‘నాన్న’ బాధ్యత మరిచిపోయాడు. కూతుళ్లు పుట్టారని భార్య బిడ్డలను వదిలేసి వెళ్లిపోయాడు. అర్ధాకలితో అలమటిస్తూ ‘నాన్న’ను చూడాలని ఆ ఆడబిడ్డలు ప్రతి నిత్యం గడప వైపే చూస్తున్నారు. నాలుగేళ్లుగా కనిపించని భర్త కోసం కువైట్ వెళ్లిన ఇల్లాలు వెతుకుతూనే ఉంది. కానీ ఆ మొగుడు మాత్రం కొడుకు కోసం మరో రెండు పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లలకు జన్మనిస్తూనే ఉన్నాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఇతనికి ముచ్చట తీరలేదు. మగ పిల్లాడి కోసం పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లలను అనాథలు చేస్తున్నాడు. ఇదంతా కడపలో చోటు చేసుకుంది వైనం.

-రమణి రాచపూడి

One thought on “వంశాంకురం కోసం పెళ్లి మీద పెళ్లి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *