Views:
15

నరకం అంచుల దాక వెళ్లి వచ్చాము అంటారు .. కాని నిజంగా ఆ అంచు ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇదిగో ఈ ఫోటో చూడండి మనల్ని తీసుకెళ్ళి ఒక కొండ అంచున నిలబెడితే ఒక్క అడుగు వేస్తె మన ప్రాణం గాలిలో కలిసిపోతుంది అని మనకి తెలుసు కాబట్టి వెనకడుగు వేసి ప్రాణాలని కాపాడుకోవాలని చూస్తాము. కాని ఏమి తెలియని పసికందు? పొరపాటున ఒక పక్కకి ఒరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. సౌదీలోని మక్కా రహదారిలో దిక్కట్ అల్ అల్ హల్వాని ప్రాంతంలో ఈ ఫోటో తీశారు. అల్ హుడా పర్వతాల పై అంచున పడుకోబెట్టిన ఈ పాప ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఈ హుడా పర్వతాలపై ఫోటోలు నిషిద్దం మరి ఇంత ప్రమాదకరమయిన ఫోటో అలా ఎలా తీసారో పిల్ల ఆటాపాటలు చూసి ఆనందించవలసిన వాళ్ళు ఇలాంటి భయంకరమయిన సాహసాలకి ఎలా ఒడిగట్టారో.

అయితే కొందరు మటుకు ఇది గ్రాఫిక్ అని కొట్టిపడేస్తున్నారు. ఏది ఏమయినా ఇలాంటి సున్నితమయిన అంశాలలో సాహసం చేయకూడదు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమా.. ?

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *