Views:
18

ఈమధ్యే సౌదీలో సెల్ వాడము అని వధూవరులు ఇరువురు అగ్రిమెంట్ రాసుకుని పెళ్లి చేసుకుని అగ్రిమెంట్ కి విరుద్ధంగా వధువు సెల్ లో ముచ్చట్లు పెట్టుకున్నందుకుగాను అదేరోజు విడాకులు కోరాడు వరుడు. ఇక కువైట్ లో కూడా మరీ విడ్డూరంగా చిన్న చిన్న విషయాలకే విడాకుల దారి పడుతున్నారు జంటలు.

చిన్నచిన్న కారణాలతో పెళ్లయిన కొద్దిరోజులకే మహిళలు విడాకులు కోరుతున్నారు పెళ్లి అయిన వాటికన్నా విడాకుల కేసులు విపరీతంగా వస్తున్నాయని కోర్టు ఒక విశ్లేషణలో తెలిపింది.

భర్త ఆహారపు అలవాట్లు, ప్రవర్తన నచ్చలేదని ఓ యువతి… పెళ్లైన వారం రోజులకే విడాకులు కావాలని కోర్టుకెళితే, తన భర్త ఎప్పుడూ టూత్ పేస్ట్ ని మధ్యలో నుంచే పిండుతారని, ఇది తనకు నచ్చలేదంటూ మరో యువతి విడాకులకు దరఖాస్తు చేసకుంది.

ఇలాంటి వాటికి కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..

-రమణి రాచపూడి

One thought on “టూత్ పేస్ట్ మధ్యలోంచి పిండితేనే ఇంత శిక్షా?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *