Views:
12

న్యూఢిల్లీ : విశాఖ ఎయిర్‌పోర్ట్ లో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దురుసు ప్రవర్తనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు స్పందించారు. గంట ముందే వచ్చినా, సిబ్బంది బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని జేసీ అనడాన్ని అశోక్ గజపతి తప్పుపట్టారు. అన్ని వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయివుంటాయని ఆయన అన్నారు. అన్ని విషయాలు పరిశీలించి ఎవరిది తప్పో తేలుస్తామని ఆయన అన్నారు. తప్పు ఎవరు చేసినా  శిక్ష తప్పదని అశోక్‌ గజపతి రాజు అన్నారు.

అశోక్ రికమెండేషన్ తో జేసీకి బోర్డింగ్ పాస్

ఘటన జరిగిన సమయంలో వీఐపీ లాంజ్‌లో ఉన్న అశోక్ గజపతిరాజు వద్దకు వెళ్లిన జేసీ.. సిబ్బంది తనన అవమానించారని చెప్పారు. దాంతో అశోక్ విమాన సంస్థ అధికారులను ఒప్పించి జేసీకి బోర్డింగ్‌పాస్‌ ఇప్పించారు. అయితే ఆలస్యంగా వచ్చినా బోర్డింగ్ పాస్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.

మొదటిసారి కాదు..

జేసీ ఇలా దురుసుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. 2016 అక్టోబర్ లో సైతం ఎయిర్ ఇండియా సిబ్బందితో జేసీ దురుసుగా ప్రవర్తించి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *