Views:
7

యజమాని చిత్రహింసలతో ఆసుపత్రి పాలయిన మెయిడ్  తన యజమాని తనని ఎలా చిత్ర హింసలు పెట్టారో సౌదీ అరేబియాలోని నజరాన్ పోలీసులకి వేదనతో వెల్లడించింది. తనని కంటి కింది భాగంలో బలంగా గుద్దారని, జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి , సున్నితమయిన భాగాలలో కాలితో బలంగా తన్ని పైశాచిక ఆనందాన్ని పొందేవారని ఆ యజమాని వల్ల తానూ నరకయాతన అనుభవించానని,  తనని రక్షించాలని వేడుకుంది.

కేస్ ఫైల్ చేసుకున్న నజరాన్ పోలీసులు ఆ యజమానిని అరెస్ట్ చేసారు. ఒకవేళ ఆమె చెప్పింది నిజమని తేలితే అతనికి జరిమానా, ఇకపై కద్దామాలని నియమించే హక్కు కోల్పోవడం, కోర్టులో కేసులని ఎదుర్కోవడం లాంటి పరిస్థితులని ఎదుర్కోవచ్చని పోలీసులు తెలిపారు.

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *