Views:
13

అయిపొయింది అనుకున్నంత అయింది మనం ఈ దేశానికి సంబందించినవాళ్ళమా? మనకిక్కడ సెక్యురిటీ ఉందా అని ఎన్నోసార్లు శ్రీను అడిగేదాన్ని ‘అసలు మనుషుల మంచి, చెడులను ఎలా నిర్ణయిస్తారు. చర్మం రంగు ద్వారానా? కాదు కదా… ఇటువంటి సున్నితమైన విషయాల గురించి నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకుని వదిలేస్తే సరిపోతుందా?’ అంటున్న సునయన ప్రశ్నలకు సమాధానం ఎక్కడదొరుకుతుంది?  అమెరికాలో కాల్పులకి గురి మృతి చెందినా శ్రీనివాస్ కూచిభొట్ల బార్య సునయన పేస్ బుక్ పోస్ట్. ప్రతి ఒక్కరు చదవాల్సినది

‘ఫేస్‌బుక్‌లో నేను అధికారికంగా చేస్తున్న బ్లాగ్‌ పోస్ట్‌ ఇది. ఎంతో భారమైన మనసుతో నేను ఈ పదాలు రాస్తున్నాను. 2017 ఫిబ్రవరి 22, బుధవారం రాత్రి నా జీవితంలో ఎంతో భయంకరమైనది. నేను నా భర్తని, నా స్నేహితుడ్ని, నా ఆప్తుడ్ని శాశ్వతంగా కోల్పోయాను. కూచిభొట్ల శ్రీనివాస్‌ నాకు స్ఫూర్తి. ఆయన నాకు ఒక్కదానికే కాకుండా తనకి పరిచయమున్న ప్రతి ఒక్కరికీ ఎంతో అండగా నిలిచేవాడు ఆయన. ప్రతి ఒక్కరి కోసం ఆయన ముఖాన చిరునవ్వు ఉండేది. అందర్నీ గౌరవించేవాడు. ప్రత్యేకించి పెద్దవాళ్లంటే అతడికి మరికాస్త గౌరవం ఎక్కువ.

ఆయనే కారణం!

మా ఇంట్లో నేను చిన్నదాన్ని. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. అందుకని నేను ఎటువంటి బాధ్యతలూ లేకుండా పెరిగాను. అమెరికా వెళ్లి చదువుకోవాలనే నా కలకు ధైర్యాన్ని ఇచ్చింది శ్రీనివాసే. నేను స్వతంత్రంగా, ఆత్మస్థైర్యంతో, దృఢమైన మహిళగా ఉన్నానంటే ఆయనే కారణం. నేను ఈ మధ్యనే అంటే 2016 మే నుండే ఉద్యోగం చేస్తున్నాను. నా ఉద్యోగం విషయంలో కూడా ఆయనదే ప్రధాన పాత్ర. ప్రోత్సాహాన్ని ఇస్తూ, నేను డిసప్పాయింట్‌ అయినప్పుడు కూడా నాతో కలిసి పనిచేసేవారు. మరీ ముఖ్యంగా నాలుగేళ్ల కెరీర్‌ బ్రేక్‌ తరువాత మళ్లీ మొదలుపెట్టినప్పుడు!

విమానయాన రంగంలో కొత్తగా ఏదైనా చేయాలన్న తపన ఉండేది తనకు. అమెరికాలో ఆయన రాక్‌వెల్‌ కొల్లిన్స్‌ లో తన కెరీర్‌ మొదలుపెట్టారు. అక్కడ ఫ్లయిట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌లో పనిచేశారు. అదికూడా ఫ్రైమరీ ఫ్లయిట్‌ కంట్రోల్‌ కంప్యూటర్‌లో పనిచేసేవారు. దీనిద్వారా విమానాలు మెరుగ్గా ప్రయాణించేలా చేస్తుంది. ఆయన తన జీవితాన్ని దీన్ని అభివృద్ధి చేసేందుకే అంకితం చేశారు. కొన్ని రోజుల పాటు తను కేవలం రాత్రి భోజనం చేసేందుకు ఇంటికి వచ్చి, మళ్లీ పనిచేసేందుకు వెళ్లి, తిరిగి ఉదయం రెండు నుంచి మూడు గంటల మధ్య ఇంటికి వచ్చేవారు. రాక్‌వెల్‌లో పనిచేయడం తనకెంతో ఇష్టంగా ఉండేది. అలాగే చిన్న పట్టణం ఐయోవా సెడార్‌ ర్యాపిడ్స్‌లో ఉండడాన్ని బాగా ఇష్టపడేవారు. అయితే నా ఉద్యోగం కోసం సిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అక్కడికి వెళ్తే నా కలలకి వాస్తవరూపం రావడమే కాకుండా తన కెరీర్‌కి కూడా బాగుంటుంది అనుకున్నాం. అప్పుడు కన్స్‌సకి వెళ్లాలి అనుకున్నాం. మా కలల్ని నిజం చేసుకునేందుకు అక్కడికి వెళ్లాం. అక్కడే మా కలల ఇంటిని కట్టుకున్నాం. ఆ ఇంటికి ఆయనే పెయింట్‌ వేశారు. గ్యారేజ్‌ డోర్‌ కూడా ఆయనే స్వయంగా ఏర్పాటు చేశారు. ఇంటికి సంబంధించిన ఏ చిన్న పని అయినా స్వయంగా తనే చేయడాన్ని ఇష్టపడేవాడు. ఆ తరువాత పిల్లల్ని కని, కుటుంబాన్ని సంపూర్ణం చేసుకోవాలి అనుకున్నాం. కాని దురదృష్టం… మా కలలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇదంతా కూడా ఒకే ఒక వ్యక్తి వల్ల జరిగింది. అతను (కాల్పులు జరిపిన ఆడమ్‌ ప్యూరింటన్‌) చేసిన పని వల్ల ఒక కుటుంబం మీద ఎంతటి ప్రభావం పడుతుందనేది ఏమాత్రం ఆలోచించలేదు.

****

  • రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *