Views:
72

బంగ్లాదేశ్ క్రికెట్ అభిమాని భారత జెండాని అవమానించిన ట్వీట్ ఇదే …

ఈరోజు ఎడ్జిబాస్టన్ వేదికగా ఐసిసి చాంపియన్ షిప్ ట్రోపీ లో భాగంగా   ఇండియా బంగ్లాదేశ్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ క్రికెట్ మ్యాచ్ కి ముందుగానే బంగ్లాదేశ్, భారత్ పోరుపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య యుద్ధం జరుగుతోంది.

బంగ్లాదేశ్ అభిమాని భారత జాతీయ జెండాను అవమానిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారనుంది. అతడు పోస్టు చేసిన పోటోషాప్ ఇమేజిలో మన మూడు రంగుల జెండా కుక్కపై కప్పగా, దాని వెనకునే బంగ్లా జాతీయ పతాకం కప్పబడి ఉన్న టైగర్ వెంటాడుతూ ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు ఆ జట్టు ఆటగాళ్లను ‘టైగర్స్’ అని పిలుచుకోవడం లోక విదితమే. అంత మాత్రాన ఇలా ఇండియాని కుక్కతో పోలుస్తూ దానిపై జాతీయ జెండాని కప్పడం దానిని బంగ్లాదేశ్ జెండాతో టైగర్ తరుముతున్నట్లుగా చూపడం జాతీయ జెండాని అవమానించడమే అని నేటిజేన్లు, క్రికెట్ అభిమానులు ఈ ట్వీట్ ని పెద్ద ఎత్తున్న విమర్శిస్తున్నారు.

వార్తా మూలం : వన్ ఇండియా

  • రమణి రాచపూడి

One thought on “భారత్-బంగ్లా క్రికెట్… అభిమాని వల్ల జాతీయ జెండాకి అవమానం”

  1. ఇది ఒక ఆట, ఓడినా , గెలిచినా దేశంని నిందించకూడదు పరాయి దేశం వాళ్ళు ఇలా దేశ జాతీయ జెండాని అవమానించడం ఖండిచాలి. ఇలాంటి వాటిని అసలు సమర్ధించకూడదు. దేశాభిమానులు, క్రికెట్ అభిమానులు ఈ విషయమై స్పందించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *