Views:
8

రోజులు దొర్లిపోతూ ఉంటాయి మన పరిచయాలు దూరం అవుతూ ఉంటాయి, మన పిల్లల,  పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. మన యాంత్రిక జీవనంలో అలసి , సొలసి విశ్రాంతి తీసుకునే సమయంలో పిల్లలు మనం సంపాదించే రోజుల ఫోటోల ముందు నించుని “ఎవరు వీళ్ళు “అని అడిగితె? ఒక్కసారి ఊహించండి ఎందుకు ఇంత సంపాదన? మన మనసుతో మనం చెప్పుకోగలం ఆరోజుల్లో నాతోకష్టపడి నాతొ నడిచిన మనసు ఫోటోలు కదూ అవి అని… కాని పిల్లలికి ఏమి చెప్తాము నువ్వు ఏమి చదువుతున్నావో తెలీదు , నువ్వేమి తింటున్నావో తెలీదు, కనీసం నీ స్కూల్, కాలేజ్, ఏవి నాకు తెలీదు డబ్బు సంపాదించే ఆ ఒక్క పని తప్ప అని చెప్పగలమా?

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే??????????

మనకంటూ ఏముంది ఒక పెద్ద కాంక్రీటు భవనం, మోసుకెళ్ళల్లడానికో బెంజ్ కారు, ఇంట్లో అందమయిన ఇంటీరియర్ డిజైన్, వీటికోసమే కదా మనం అహర్నిశలు కష్టపడింది.

ఎవరికీ స్ఫూర్తిదాయకం మనం  ఈ ఎత్తైన భవనాల కట్టడాలు ఆర్భాటాల పెళ్ళిళ్ళు  వల్ల…

కోట్లుఖర్చు పెట్టి జరిగిన ఏ పెళ్ళిలో అయినా మనము ఏమి తిన్నాము అని ఒక రెండురోజుల తరువాత గుర్తుపెట్టుకోగాలమా?

ఎందుకు ఇలా రాత్రింభవళ్ళు  కష్టపడి పని చేయడం? ఇంకెన్ని సంవత్సరాలు ఇలా?

ఇంకెన్ని తరాలకు మన ఈ గొడ్డు చాకిరీ?

మనలో చాలామందికి ఇద్దరు లేదా ఒక్కరే పిల్లలు మరి అయినా మన చాకిరీకి విశ్రాంతి ఏది?

అసలు మనకి ఏమి కావాలి? మన అవసరాలకి హద్దు ఏది?

ఈరోజు మనం సంపాదించి కూడబెట్టిన సొమ్ము మన తరవాతి తరం వారికి ఆదర్శప్రాయం అవుతుందా లేక సోమరిపోతును చేస్తుందా?

మనం వారంలో  ఒక్కరోజు పోని ఓకే పూట స్నేహితులతో సరదాగా గడపగాలుగుతున్నామా?

మన సంపాదనలో 5%  అన్నా మన సొంతానికి వాడుకోగలుగుతున్నామా?

సంపాదిస్తున్నప్పుడు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాము

మనకోసం కొంచం సమయం కేటాయించుకుందాము, మరణం మన వాకిట నిలబడే ముందే మన సమయంలో  జీవితాన్ని ఆస్వాదిద్దాం. ఏ గుండె నేప్పో, ఏ మధుమేహమో మనల్ని పలకరించే ముందుగానే మనం సంతోషం దరి చేరుదాము.

ఏది శాశ్వతం కాదు ఈ ఇల్లు, కారు, ఇవన్నీ తాత్కాలికం, వీటిమీద మన పేర్లు కొంతకాలమే…

ఒక పెద్ద కారుని బట్టో , ఓ పెద్ద ఇల్లుని బట్టో ఒక మనిషిని అంచనా వేయద్దు , అతని జీవన విధానాన్ని బట్టి అతనిని/ఆమెని అంచనా వేద్దాము.

మన ముందు తరాల టీచర్స్, లెక్చరర్స్ ని ఒకసారి చూడండి  ఇప్పటికీ స్కూటర్స్ మీద సంతోషంగా తిరుగుతూ ఉంటారు.

జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుని ఆస్వాదిద్దాం. జీవితం మనల్ని కబళించకముందే..

  • రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *