Views:
9

చదువు అనేది మనిషికి అవగాహనను పెంచాలి… విజ్ఞానవంతుడిని చేయాలి… ఆ విజ్ఞానం సమస్యలను పరిష్కరించాలి… బాధ్యతలను నెరవేర్చాలి.

ఈ ప్రపంచంలో చాలా మంది చదువుకున్న విజ్ఞానవంతులే. కాని ఆలోచన పరంగా విషయరాహిత్యం కలవారు. చదువుకునే సమయంలో స్కూల్ అంటే నచ్చకపోవడం చదువు అంతే ఇష్టం లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు లేదా టీచర్ చెప్పే పాఠాలు అర్థం కాకపోవడం లాంటివి విద్యార్థులకి  సహజంగా జరిగే పరిణామాలు. అప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి. ముందు మనకి టీచర్ గురించి సరి అయిన ఆలోచన ఉండాలి. టీచర్ నేర్పించే విధానం బోరు కొడుతుంటే టీచర్ అసలు ఈ విషయం చెప్తున్నారో ఆ విషయం పై దృష్టి సారించి ఏకాగ్రత పెట్టారంటే విషయ పరిజ్ఞానం అలవడుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలనుండి పని చేస్తున్న ఆ టీచర్ ఆ పాఠం మనలాంటి విద్యార్థిని విద్యార్థులకి ఎంతోమందికి చెప్పే ఉంటారు కాబట్టి ఆవిడకి ముఖంలో మునుపు ఉన్నంత ఉత్సాహం ఉండకపోవచ్చు అనే ఆలోచన ఉండాలి. . ఎప్పుడు ఒకేలా ఉండగలగడం అనేది ప్రతీ టీచర్ కి ఒక ఛాలెంజ్ లాంటిది కాబట్టి ఆవిడ పాఠం చెప్పే విధానాన్ని కాక చెప్తున్న అంశంపై దృష్టి సారిస్తే మనం మంచి విధ్యార్థినీ విద్యార్థులం అవుతాము.

సందేహం రాకపోతే మంచిదే కాని వచ్చిన సందేహం అడగని వాడు ఎప్పటికి మూర్ఖుడే అంటారు పెద్దలు.

టీచర్ చెప్పేవి రాసుకోవాలి. చెప్తున్న అంశంపై ఇంకొంచం తెలుసుకోవాలి అని ఆసక్తి కలగడం సహజం. అప్పుడు లేచి మర్యాదగా అడిగితే మన టీచర్స్ చక్కగా వివరించి చెప్తారు. అలాగే మనం చూపించే ఏకాగ్రత, ఆసక్తి లాంటివి పక్క విద్యార్థులకి స్ఫూర్తి లాంటిది వారుకూడా ఉత్సహంగా మన సందేహాలలో , చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.

ఇలా పరస్పర ఆలోచనలతో స్కూల్ లో పాఠం చెప్పారు, విన్నాము, బట్టీ పట్టాము అన్నట్లు కాకుండా అర్థం చేసుకుని , సందేహాలని తీర్చుకుని చెప్తున్న అంశాన్ని ఆకళింపు చేసుకుని చదువులని కొనసాగిస్తే మంచి విద్యార్థులం అవుతాము.

  • రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *