Views:
6

గల్ఫ్ దేశాలకు వెళ్ళగలిగితే చాలు….లక్షలకు లక్షలు సంపాదించేయొచ్చునని చాలామంది భ్రమల్లో ఉంటారు. అయితే,వెళ్ళిన తరువాత వాళ్ళు అక్కడ ఏమి చేస్తున్నారో ఎలా ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఉన్న కుటుంబానిది. కుటుంబాన్ని పోషించలేక గల్ఫ్ కి వెళ్తే అక్కడినుండి తమ కుటుంబ పోషణ చాలా సులభతరం అవుతుంది అని భ్రమ పది అప్పు చేసి లక్షలు కట్టి దుబాయ్ వెళ్ళాడు శంకర్.దుబాయి వెళ్ళే సమయానికి బార్య భూదేవి నిండు గర్భిణీ.. ఓ కంట కన్నీరు, మరో కంట ఆనందభాష్పాలతో సాగనంపింది బార్య, తమ కష్టాలు గట్టేక్కుతాయి అన్న అన్న భ్రమ ఆమెది. ఇప్పటికి 12 ఏళ్ళయింది. భర్త తిరిగి రాలేదు. వెళ్ళిన తరువాత అతనేమి చేస్తున్నాడో సమాచారం కూడా లేదు. పుట్టిన కొడుకుకి ఇప్పుడు 12 ఏళ్ళు. అరా తీయగా శంకర్ అక్కడ 9 ఏళ్ళుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని తెలిసింది.అనుకోకుండా చేయని నేరానికి జైలు పాలయ్యాడని అతనికి మరణ దండన శిక్ష విధించారని తెలిసి హతాశురలయింది భూదేవి. హత్యానేరం శిక్షలో ఉన్న ఆతను అక్కడి భాదిత కుటుంబానికి 6 లక్షలు చెల్లిస్తే తప్పితే ఆతను బయటపడే అవకాశాలు ఉన్నాయని, లేకపోతె ఉరిశిక్ష ఖాయమని తెలిసింది. ఈ నేపధ్యంలో భర్తకు ప్రాణభిక్ష పెట్టమని సోమవారం నాడు సోమాజీగూడలో జరిగిన ప్రెస్ క్లబ్ లో విన్నవించుకుంది.

2005లో దుబాయ్ వెళ్ళిన శంకర్ ఓ కంపనీలో ఫోర్మేన్ గా చేరాడు. ఇతనిది నల్గొండ జిల్లా.. అయితే ఓ రోజు ఇతను ఇతని మరో రామావతార్ కలిసి ఆరో అంతస్తులో పని చేస్తున్నారు అయితే ప్రమాద వశాత్తు రామవతర్ ఆరో అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు. ఏమి ఎరగని శంకర్ పై హత్యా నేరం మోపారు కంపెనీవారు. అప్పటినుండి ఆతను పుజిర జైలు లో శిక్ష అనుభవిస్తున్నాడు. దుబాయ్ చట్టం ప్రకారం చనిపోయిన అతని కుటుంబ సభ్యులు క్షమాబిక్ష పెడితే ఇతనిని స్వదేశం పంపిస్తారు. ఎన్నోసార్లు ఏంటో మంది చేత రాజస్థాన్ పంపి క్షమాబిక్ష పెట్టమని వేడుకునా రామావతార్ కుటుంబ సభ్యులు కనికరించలేదు. ఆఖరికి 6.50 లక్షలు చెల్లిస్తే క్షమిస్తామని చెప్పగా ఇప్పుడు శంకర్ బార్య తమని రక్షించమని తన భర్తకి క్షమాబిక్ష పెట్టమని వేడుకుంటోంది. ఈ డబ్బులు చెల్లించదానికి కేవలం నెలరోజులు గడువు మాత్రమె ఉందని తనని ఆదుకొమ్మని వేడుకుంటోంది.

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *