Views:
10

ఐసిటి:

ఈ పదము ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీస్‌ (ఐసిటి) అంటే, సమాచార, సంసర్గ సంబంధిత సాంకేతికపరిజ్ఞానం, అది సృష్టించే, ప్రసారం చేసే, దాచే, చూపించే, పంచుకునే ఎలక్ట్రానిక్‌ సాధనాల గురించి వాడబడింది. ఇంత విస్తారమైన నిర్వచనం కల ఐసిటి రేడియో, టెలివిజన్‌, వీడియో, డి.వి.డి., టెలిఫోన్, (ఫోన్లు, మొబైల్‌ ఫోన్లు) ఉపగ్రహ (శాటిలైట్‌) సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సాఫ్ట వేర్‌ హార్డ్‌వేర్‌ ల సముదాయాని కి వర్తిస్తుంది. ఇంతే కాక ఈ సాంకేతిక పరిజ్ఞానాని కి అవసరమైన పరికరాలు, వాటి సేవల కు కూడా వర్తిస్తుంది.

ఉదాహరణలుః వీడియో కాన్ఫరెన్సింగ్‌, ఇ-మెయిల్‌ మరియ బ్లాగులు.

ఈ సమాచార యుగము లో విద్య యొక్క లక్ష్యాలు సాధించడానికి ఆధునిక సమాచార సంసర్గ సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్య తో అనుసంధించాలి. ఇది సమర్ధవంతంగా నిర్వహించడానికి, విద్యా పధక రచయితలు, పాఠశాల ప్రధానధికారులు, ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు, ఎన్నో నిర్ణయాలను ఈ విషయాల్లో తీసుకోవలసి ఉంటుంది. సాంకేతిక శిక్షణ, ఆర్ధిక, బోధన, నిర్మాణ సౌకర్యాల అవసరాలు.

చాలమందికి క్రొత్త భాష నేర్చుకోవడమే కాక, ఆభాష లో బోధించడం లాంటి కష్ట సాధ్యమైన పని ఇది. ఈ విభాగం సాంకేతిక సాధనాల గురించే కాక, దేశాలను కలిపే ఉపగ్రహాల నుంచి పాఠశాల గదుల్లో విద్యార్ధులు ఉపయోగించే యంత్రాల వరకు వివరిస్తుంది. ఇది ఉపాధ్యాయులకి సహాయకారి గాను, విధానకర్తలు, ప్రణాళికా రచయితలు, పాఠ్యాంశాలు వృద్ధి పరిచే వారు, ఇంకా ఇతరులకి ఐసిటి సాధనాలు పదాలు, పద్ధతుల ఉపయోగించే క్రమం లో కలిగే గందరగోళాన్ని నివారించడం లో ఉపయోగపడుతుంది.

నేటి సాంకేతికతః
బోధనలోని వివిధ విభాగాల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు పై పరిశీలనః

బోధనా సాధనములు.

ఆడియో (శ్రవణ), విజువల్‌ (దృశ్య), డిజిటల్‌ పరికరములు.
సాప్టవేర్‌ మరియు కంటెంట్‌-వేర్‌.
అనుసంధానంలో రీతులు.
మీడియా.
విద్యా విషయక వెబ్‌-సైట్స్‌.

  • రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *