Views:
60

వార్త: చిరు రాజశేఖర్లు ఉప్పు నిప్పు అన్న విషయం అటు సినీ వర్గాలకే  కాకుండా ఇరువురి అభిమానులకు తెలిసిన విషయమే. కాని  ఆమధ్య రాజశేఖర్ పై చిరు అభిమానులు దాడి చేసినప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ చిరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి మరీ ఈ ప్రకటన చేసారు.  అయినా ఆ రావణ కాష్టం రగులుతూనే ఉంది అని మొన్న దివంగత దాసరి అంత్యక్రియల సమయంలో యాదృచ్చికంగా ఒకరు వెళ్ళిన తరువాత ఒకళ్ళు వచ్చారు అన్న విషయాన్ని ప్రాతిపదికగా తీసుకుని పుకార్లు సృష్టిస్తున్నారట సినీ జనాలు.

విశ్లేషణ: ఠాగూర్ సినిమా మాతృకని  ముందుగా రాజశేఖర్ కొని  తెలుగులో సినిమా తీద్దామని అనుకుంటుండగా… చిరంజీవి తిమ్మిని బమ్మిని చేసి ఆ సినిమా రైట్స్ తన సొంతం చేసుకోవడం తో  ఇద్దరిమధ్య వివాదం చెలరేగి శత్రువులయ్యారని కథనం.  ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె   భగ్గుమంటుంది అని కూడా సినీ పరిశ్రమ నోళ్లు నొక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో హీరోలే కాక అభిమానులు కూడా మా హీరో అంటే    మా  హీరో అంటూ ఎదురుపడినప్పుడు కళ్ళల్లో నిప్పులు కురిపించుకునేవాళ్ళని  అభిజ్ఞ వర్గాల సమాచారం. ఈ శత్రుత్వపు పరంపరలోనే రాజశేఖర్ కారుపై  అభిమానులు దాడి చేయడంతో ,చిరంజీవి కలగాజేసుకోక  ఈ వివాదం పై కలగాజేసుకోలేక తప్పలేదు. వెంటనే  తానె స్వయంగా వెళ్లి   రాజశేఖర్ ని పరామర్శించి    ప్రెస్ మీట్ పెట్టి తామిద్దరం మంచి స్నేహితులమని, తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని ప్రకటన చేయడం జరిగింది. హమ్మయ్య వాతావరణం చల్లబడింది అని అందరూ అనుకున్నారు.

వ్యాఖ్య: వాతావరణం చల్లబడడమా ఇంకేమన్నానా?  కాస్తంత సందు దొరికితే చాలు ప్రశాంతమయిన సముద్రంలో రాళ్ళు వేసే వారు ఉంటారు  వీళ్ళిద్దరూ ఏంటి ఇంత సైలెంట్ అని అదిగో చూడు , చిరంజీవి వచ్చి వెళ్లినతరువాత రాజశేఖర్ వచ్చాడు, అనో , రాజశేఖర్ వచ్చి వెళ్ళిన తరువాత చిరంజీవి   వాచ్చాడనో ఎవరో ఒకరు రాయి విసరడం.. “అబ్బే వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది ఊరికే అలా ప్రకటన ఇచ్చారు అంటూ నిప్పు     రాజేసే వారు ఎప్పుడు ఉంటూ  ఉంటారు…   ఈ లోల్లికి చరమాంకం పాడాల్సింది వాళ్ళే మరి.

వి – శేషం : తోచి తోచనమ్మ    తోడికోడలి పుట్టింటికి వెళ్ళింది అన్నట్లు ఏమి తోచని వాళ్ళు ఇలాంటి మాటలతో లేని వివాదాలు తెచ్చి పెడుతూ ఉంటారు. మనలాంటి విజ్ఞులు చదివి సరే ఇదో పెద్ద   అంతర్జాతీయ  సమస్యా అని పెదవి విరిచి అసలు చిరు రాజశేఖర్ల మధ్య ఈ లోల్లిఎంది బై అనుకుంటాము తప్పితే , మనకవసరమా ఇలాంటి అర్థంలేని వివాదాలు , వాళ్ళు డబ్బులు సంపాదిచుకుంటూ బాగానే ఉంటారు మధ్యలో మనమెందుకు మా హీరో అంటే మా  హీరో అనుకుంటూ సమయాన్ని వృధా చేసుకోవాలి,, అని ఆలోచిస్తాము/ఆలోచించాలి .

వార్తా: ఫిల్మీ బీట్స్

-రమణి రాచపూడి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *