Views:
15

ఖతర్‌.. ఐసిస్‌ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తూ మద్దతు ఇస్తోందనే ప్రధాన ఆరోపణతో జూన్‌ 5న పొరుగు దేశాలు దౌత్య సంబంధాల్ని తెంచుకోవడంతో పాటు తమ దేశాల్లోని ఖతర్‌ పౌరులు 14 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలనీ అల్టిమేటం జారీచేశాయి. ఈ నేపథ్యంలో ఖతర్‌లో ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆ దేశానికి అవసర మయ్యే ఆహారంలో దాదాపు 40 శాతం సర ఫరా అవుతున్న ఏకైక భూసరిహద్దు మార్గాన్ని సౌదీ మూసివేసింది. ఈ నేపధ్యంలో ఖతార్ లోని భారతీయులు  భయాందోళనలకు గురి అవుతున్నారు.

ప్రపంచంలో మూడో అతి పెద్ద సహజవాయువు నిక్షేపాలు, చమురు నిల్వలున్న ఖతర్‌ విస్తీర్ణం 11,586 చదరపు కిలోమీటర్లు. 2003లో జనాభా ఏడు లక్షలు కాగా.. ప్రస్తుతం 25 లక్షలు.. 2022 ఫిఫా ప్రపంచకప్‌ పోటీల కోసం స్టేడియాలు, ఇతర నిర్మాణ పనులు పెద్ద ఎత్తున సాగుతుండడంతో భారత్, ఇతర దేశాల నుంచి భారీగా వలసలు చోటుచేసుకు న్నాయి.
జనాభాలో 12 శాతం ఖతర్‌ పౌరులు కాగా.. మూడో వంతు(6.5 లక్షలు) భారతీ యులే. మతపరంగా ముస్లింలు, క్రైస్తవుల తర్వాత మూడో స్థానంలో హిందువులే ఉన్నారు. ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నా పని పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. చాలా మం ది కార్మికులు ఇంకా శిబిరాల్లోనే దుర్భర పరిస్థితుల్లోవున్నారని పలు అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. కార్మికులు దోపిడీకి గురవుతున్నారని అవి పేర్కొన్నాయి.

  • రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *