Views:
52

వార్త:

టి వి ల్లో విపరీత ద్వంద్వార్థాలతో మగవాళ్ళే ఆడవాళ్ళ వేషాలు వేసుకుని హాస్యం పేరిట వెకిలి హాస్యం పంచుతున్న జబర్దస్త్, పటాస్ నిర్మాతలకు  మానవ హక్కుల కమిషన్  వివరణ కావాలంటూ నోటీసులు పంపడం తాజా సమాచారం. ఈ షోల్లో అసభ్యత పెరిగిందని హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు ఎన్ దివాకర్ ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, సదరు షోలపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ.. ఈ రెండు కార్యక్రమాల నిర్మాతలు, దర్శకులకు నోటీసులు జారీ చేస్తూ, ఆగస్టు 10 లోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

వ్యాఖ్య:

స్కూల్ విద్యార్ధి చేత కత్తిలా ఉంది ఫిగరు లేదా.. అతనికి ముదురు వేషాలు వేయించి అతిగా నటింపజేయడం, తమ పక్కన నివసించే ఆడవాళ్ళు తమకోసమే అనే విపరీత అర్థాలతో యాంకర్ల వెకిలి వేషాలతో జబర్దస్త్ , పటాస్ కార్యక్రమాలు పలువురి విమర్శలు అందుకుంటున్నాయి. వీటిపై చర్య తీసుకోవాలని మహిళా సంఘాలు ధ్వజమేత్తడం మంచి పరిణామం.

విశ్లేషణ : 

జబర్దస్త్, పటాస్‌  లపై  ప్రేక్షకుల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది . మగవాళ్లకి ఆడవేషాలు వేస్తూ అత్యంత జుగుస్పాకరంగా బూతులు, ద్వందార్థాలు  మాట్లాడిస్తూ  ఆడవారినికి కించపర్చేలా  చిన్న పిల్లలను కూడా అత్యంత దారుణంగా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . చిన్న, పిల్లలతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడించడం అన్నీ ద్వందార్థాల మాటలే  ఈ షో లలో వినిపిస్తాయి.  ఇప్పటికే కొంతమంది ప్రముఖులు కూడా  రామోజీ రావు ఇలాంటి చెత్త షోలు నిర్వహించడం ఏమిటని మండి  పడినా ప్రయోజనం లేదు .ఈ కార్యక్రమాలపై మహిళా సంఘాలు కూడా ధ్వజమెత్తున్నాయి. మహిళలను కించపర్చే విధంగా ఈ షోలలో చూపిస్తున్నారని వివాహేతర సంబంధాలు అత్యంత కామన్ అన్నట్టుగా ఈ షోలలో చూపిస్తూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. 

వి – శేషం:

ఇక నోటీసులు అందుకుని మనవ హక్కుల సంఘానికి వివరణ ఇవ్వడం మాత్రమె కాకుండా ఇలాంటి వెకిలి హాస్యం బుల్లి తెరపై ఖండించాలి. కుటుంబ సభ్యులందరూ చూసేలా కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది (పైగా ఇక్కడ మరీ విచిత్రమయిన వివరణ ఇచ్చారు జబర్దస్త్ నటులు మేము మగవాళ్ళనె కదా కొడుతున్నది అని)    ఆడవాళ్ళని అవమానపరిచేలా ఆడవేషాలేసుకుని కాలెత్తి బార్యని కొట్టడం లాంటి హింసాత్మకమయిన వెకిలి హాస్యం ఇకనయినా మానుకుంటే బాగుంటుంది. ఈ అక్రమసంబంధాల హాస్యం, బార్యని కొట్టడం లాంటి                  వెకిలి హాస్యాలకన్న  అర్థరాత్రి వచ్చే మిడ్ నైట్ మసాల చూసుకోడం కాస్త సమయానికి తగ్గట్టు బాగుంటుంది విమర్శుకులు చెణుకులు విసుర్తున్నారు. మరి ఆలోచించండి నిర్మాతలు…. ప్రేక్షకుల నాడి తెలుసుకోవాలి కాని, వాళ్ళు తల పట్టుకునేలా చేస్తే ఎలా అలా ?

ఇక ఆగస్టు పది తరువాత  జబర్దస్త్, పటాస్ కార్యక్రమాలు ఏ పరిణామాలకి దారితీస్తాయో వేచి చూడాల్సిందే  

సౌజన్యం : సాక్షి, కబురులు గురూ 

-రమణి రాచపూడి  , 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *