Views:
53

సుమ మలయాళం మాతృభాష అయినా గల గలా తెలుగులో అనర్గళంగా మాట్లాడగల దిట్ట. సమయానికి, సందర్భోచితంగా చెణుకులు విసరగల నేర్పరి.  మాటలకి సమాధానాలు తడుముకోకుండా ఇవ్వగల నైపుణ్యం గల ఏకైక యాంకర్. ఆమెని చూడగానే తెలుగుదనం ఉట్టిపడుతుంది. చక్కటి హావభావాలతో సెలయేరు పొంగుతున్నట్లు గల గలా మాట్లాడుతుంటే ఆమె మాటలకి , శరముల్లా ఉండే ఆమె ఛతురోక్తులకి  మెచ్చుకొని వాళ్ళు లేరంటే అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఆమంటే నిండు కుండ, సంప్రదాయమయిన కట్టుబొట్టుతో గౌరవం ఉట్టిపడే ఆ హుందాతనం. ఎవరినయినా యిట్టె ఆకర్షించే చిరునవ్వుతో దశాబ్దాలకలంగా బుల్లితేర ఎకచాత్రాధిపత్యం   అమెది.

ఇలాంటి ఈ గడుసరి, హుందాతనపు యాంకర్ కి కూడా మాటలు తూలుతున్నాయి.. నడవడిక , కట్టు బొట్టు మారింది అని నేటిజేన్లు అభిప్రాయపడుతున్నారు.  మనం అభిప్రాయ పడుతున్నారు అనేకన్నా బాధపడుతున్నారు అని  అనచ్చు.   ఈమధ్య జరిగిన ఓ ఆడియో ఫంక్షన్    లో  ఆమె కట్టు , బొట్టు మారిందని ఓ ఎన్నారై  పోస్ట్ మీరే చూడండి.

వార్త:

వ్యాఖ్య:

నిజానికి సుమకి బుల్లితెరపై చక్కటి స్థానం ఒక గౌరవం ఉన్నాయి. ఎంతో హుందాగా గడపవచ్చు. మిగతా ఏ యాంకర్స్ కి లేని గౌరవం సుమకి ఉంది . మరి  మిగతా కార్యక్రమాల ప్రభావం ఆమెపై పడిందో లేక ద్వంధ్వార్తాలే కార్యక్రమాన్ని నడిపిస్తున్నాయని అపోహలో ఉందొ ఏమో కాని ఈమధ్య ఆమె తీరు మారింది అని నేటిజేన్లు, అభిమానులు మండిపడుతున్నారు.

విశ్లేషణ:

ఈ మధ్యకాలంలో  బుల్లితెరపై కార్యక్రమాల ట్రెండ్ మారింది అనే చెప్పాలి. ఓ రెండు కలేజేస్ నుండి స్టూడెంట్స్ ని తీసుకురావడం, నవ్వుల కార్యక్రమం పేరిట  చాలా మాట్లాడకూడని పదాలని విపరీతర్థాలతో, ద్వంద్వ అర్థాలతో  మాట్లాడి స్టూడెంట్స్ ని పక పక  నవ్వించడం లాంటివి చాలా మాములుగా జరుగుతున్నవి. జబర్దస్త్, పటాస్ ఈ కార్యక్రమాలలో అందే వేసిన చేయి. రేటింగ్ కోసం ఎలా అన్నా మాట్లాడచ్చు అన్న భావనో మరి స్టూడెంట్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది అన్న అపోహో.. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అర్థం లేని మాటలు ఎక్కువయ్యాయి టి వి కార్యక్రమాలలో. వీటి జోష్ చూస్ సుమ కూడా ఈ టి వి లో  ఈ జంక్షన్ అనే కార్యక్రమం ప్రారంభించింది. అదీ ఇలా కాలేజ్ స్టూడెంట్స్ ఉండే కార్యక్రమమే. ఒక కార్యక్రమం చూసి ఇంకో కార్యక్రమం తప్పు లేదు కాని , ఒక యాంకర్ ని చూసి ఇంకో యాంకర్ వేషధారణ, మాట తీరు మార్చుకోనవసరం లేదు కదా…

వి – శేషం :

ఇదో పెద్ద విశేషం అనాలో దీన్ని సశేషంగా ఉంచాలో తెలియడం లేదు కాని సుమా… మీరు ట్రెండ్ సృష్టించండి కాని ట్రెండ్ ఫాలో అవకండి….. ఇప్పుడు వస్తున్న యాంకర్లు అంటే వాళ్ళ మాట, వేషం  డబ్బుకోసం అనుకోవచ్చు కాని. ఒక స్థాయికి చేరుకున్న మీరు మళ్ళీ కొత్తగా వచ్చే యంకర్లలా వేషధారణ చేయడం అనేది అభిమానులకి కాస్త మనసు నోచ్చుకుంటోంది అని విమర్శకులు నొసలు చిట్లిస్తున్నారు.

ఏంటి సుమక్కా… మీరు మీ స్థాయినుండి దిగకండి… తల ఎత్తి చూసేలా ఉండాలే తప్ప “సుమా మీరు కూడానా ?” అని అనుకోకూడదని మామాటగా… మళ్ళా ఇంకోసారి…. ప్రత్యెక విషయం గా.. విన్నవించుకుంటున్నాము.

  • రమణి రాచపూడి

 

One thought on “సుమా మీరు కూడానా?”

  1. hmm Money makes many things అన్నారు కదా అనుభవజ్ఞులు కాబట్టి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తాపత్రయం … ఏదయినా తాత్కాలికమే.. సుమ అంత తొందరగా మారదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *