Views:
8

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో చౌక ధరలో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘ఆల్‌ టైమ్‌ లో’ పేరుతో రూ.899 నుంచి ఈ ఆఫర్‌ను అందించనుంది. జూన్‌ 14 వరకూ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. ఈ ఆఫర్‌ కింద టికెట్లు బుక్‌ చేసుకున్నవారు ఈ ఏడాది జులై 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకూ ప్రయాణించవచ్చు. ఎంపిక చేసిన వన్‌ వే మార్గాల్లోనే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.
‘అగర్తాలా, అహ్మదాబాద్‌, అమృత్‌సర్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, బగ్డోగ్రా, చండీగఢ్‌, చెన్నై, కోయంబత్తూరు, డెహ్రాడూన్‌, దిల్లీ, గోవా, హైదరాబాద్‌, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ వెబ్‌సైట్‌ ప్రకారం బగ్డోగ్రా-గువహటి మార్గంలో మాత్రమే రూ.899 ధరను నిర్ణయించారు. మిగతా మార్గాల్లో ధరలు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరు-దిల్లీ మార్గంలో రూ.2,999, దిల్లీ-అహ్మదాబాద్‌ మధ్య రూ.1,999, దిల్లీ-అమృత్‌సర్‌ మధ్య రూ.1599, దిల్లీ-భువనేశ్వర్‌ మధ్య రూ.2,799, దిల్లీ-హైదరాబాద్‌ మధ్య రూ.2,499లను ప్రారంభ ధరలుగా సంస్థ నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *