Views:
18

వార్త:

ప్రముఖ హీరో మహేష్ బాబు విచారణకు హాజరుకావాల్సిందే నని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ‘శ్రీమంతుడు’ చిత్ర నిర్మాత ఎర్నేని నవీన్ కు నాంపల్లి కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. హీరో మహేష్ బాబుకు వ్యక్తిగత హాజరుకు మినహా యింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.

వ్యాఖ్య:

సో.. హీరో మహేష్ బాబును దగ్గర నుంచి చూసే అవకాశం కోర్టుల్లో పనిచేసేవారికీ, న్యాయవాదులకీ దక్కిందని ఇతర వర్గాల వారు అసూయపడుతున్నారు. హీరోలు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైనా, కాకపోయినా ఒరిగేదేముంటుందంటూ.. కొంతమంది పాత తీర్పులను నెమరేసుకుంటున్నారు.

విశ్లేషణ:  

స్వాతి మాస పత్రికకు 2012లో ‘చచ్చేంత ప్రేమ’ పేరుతో ఒక నవల వచ్చింది. ఆ నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని, ఇది కాపీ రైట్‌ ఉల్లంఘనే అంటూ ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఐపీసీ 120బీ, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్‌జే కోర్టు మహేశ్‌బాబు, కొరటాల శివలకు సమన్లు జారీ చేసింది. ఈ దాంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, మహేశ్‌బాబు, కొరటాల శివలకు కింది కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే, తాజాగా శ్రీమంతుడు నిర్మాత నవీన్ కు సమన్లను జారీ చేసిన నాంపల్లి కోర్టు.. విచారణకు  మహేష్ కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.

వి-శేషం:

హీరోలు కేసులు ఎదుర్కోవడం కొత్త కాదు. కోర్టులకు రావడమూ కొత్త కాదు. కానీ, ఎన్ని కేసుల్లో, ఎంతమంది హీరోలను నిందితులుగా నిరూపించగలిగారు. అసలు, సినిమా రచయిత, దర్శకుడు కలిసి రూపొందించిన కథను అంగీకరించే హీరోకు ఈ కాపీలతో ఎంతవరకు సంబంధం ఉంటుంది? హీరోలు, దర్శకుల సంగతి పక్కనబెడితే.. ఈసారైనా నిజమైన రచయితకు న్యాయం జరిగితే అంతకంటే సంతోషం ఏముంటుంది?

–లైన్ కింగ్

 

2 thoughts on “హీరో మహేష్ బాబు కోర్టుకు రావాల్సిందే”

  1. చూడక చూడక హీరోని కోర్టు దగ్గరే చూడాలా.. ఇలాంటి కోర్టు కేసులు హీరోలకి , నిర్మాతలకి తృణప్రాయం కదూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *