Views:
7

ఫేస్ బుక్ స్నేహాలతో జర్రంత భద్రం కొడుకో….

“అతి సర్వత్ర వర్జయేత్”

క్రికెట్ సీజన్..  కుర్రకారంతా తమ ఊళ్లల్లో స్టేడియంల చూట్టూ గుమిగూడుతూ ఉంటారు. వెళ్ళలేని వాళ్ళు టి వి ల ముందు అతుక్కుపోయి.. చూస్తూ ఉంటారు. అంతటితో ఆగితే బానే ఉంటుంది ఫేస్ బుక్ స్టేటస్ మెసేజ్ లు అప్డేట్ చేస్తారు స్కోర్స్.. ఇదిగో ఇలాంటి సమయంలో తగులుకుంటారు  బెట్టింగ్ వీరులు.. వీరి కుతూహలాన్ని కాష్ చేసుకునేవారు. అర్థం చేసుకుని తెలివి ఉన్నవాడ యితే      తప్పించుకుకోగలడు , ఓసారి చూద్దాం అని డైవర్ట్ అయితే ఇంతేసంగతులు.  ఫేస్ బుక్ గ్రూపులు క్రియేట్ చేసి అలా అందరిని తమవైపుకి తిప్పుకుని నెమ్మదిగా ముగ్గులోకి దింపుతారు. ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండాలి. వీలయినంతవరకు గ్రూపుల్లో ఎంతవరకో అంతవరకే ఉండి పక్కకి తప్పుకోవాలి కాని….. ఎక్కడయినా అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు.

తాజాగా   ఫేస్ బుక్ లో   పలు  నవ్వుల గ్రూపులలో    అడ్మిన్ గా ఫేస్ బుక్ లో ఆక్టివ్ గా ఉన్న మిరియాల జగన్ అనే వ్యక్తిని    టాస్క్ ఫోర్సు  పోలీసులు   అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. పైకేమో మెడికల్ షాప్, లోపల నడిపించేది క్రికెట్ బెట్టింగులు. ఖమ్మం జిల్లా కేంద్రంలో   ఇతను బడా బూకీ అని పోలీసులు తెలియజేస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇతని    బూకీ వ్యాపారం వల్ల, బడా వ్యాపారుల భాగోతం బయటపడుతోందని పోలీసులు తెలిపారు. ఫేస్   బుక్   లో           స్నేహాలతో జాగ్రత్తగా  ఉండాలి    అలాగే క్రికెట్  స్టేడియం లో పరిచయం అయ్యే ప్రతివారిని నమ్మేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సౌజన్యం : ఖమ్మం దిన పత్రికలు

రమణి

One thought on “ఫేస్ బుక్ లో క్రికెట్ బూకీలు… ??”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *