Views:
31

అదండీ సంగతి మాల్యాని చూడగానే దొంగ , దొంగ  అని అరిచారట మనవాడు చికాకుపదిపోయాడట, అవును మరి చికాకు పడడా.. అదేమన్నా చిన్నా చితకా సొమ్మా.. 8 వేల కోట్ల అప్పు. ఎంత రాయల్ గా ఉండాలి మరీ చీప్ గా అతనిని చూడగానే దొంగ దొంగ అని అరుస్తారా ఎవరన్నా? దొంగ గారు , దొంగ గారు రండి కూర్చోండి, వచ్చి ఇదిగో ఈ క్రికెట్ మ్యాచ్ అంతా చూసి వెళ్ళండి  అని రాచ మర్యాదలు చేయాలి కాని..

ఏంటి అందరూ అలా ఆశ్చర్యపోతున్నారు? నిజమే కదా బ్యాంకుల్లో సామాన్యుడు లక్ష రూపాయలు అప్పు చేస్తే ప్రపంచం అంతా తన చేతుల్లో పెట్టేసుకుంతాడేమో  అని హడలి పోయి ఆతరువాత అతనిని ఠారేత్తించి మరీ పైసా వసూల్ చేస్తారు కాని 8 వేల కోట్ల రూపాయల అప్పు ఉన్న మనిషి విదేశాల్లో టింగు రంగా మని తిరుగుతుంటే పట్టనట్లు ఉంటారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అసలేమి జరిగింది అంటే….

ఓవల్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ చూసేందుకు వచ్చినప్పుడు స్టేడియం బయట భారతీయులు మాల్యాను చూడగానే దొంగా దొంగా అని గట్టిగా కేకలు పెట్టారు. తొలుత తనను కాదనుకున్న మాల్యా ఆ తర్వాత ఆ కేకలు తనకోసమే అని గ్రహించారు. చోర్ చోర్ అని భారతీయులు గట్టిగా కేకలు పెట్టారు. దీంతో అవమానభారంతో మాల్యా నొచ్చుకున్నారు. ముఖం మాడ్చుకుని విసురుకుంటూ స్టేడియం లోపలికి వెళ్లిపోయారు.

మరి వెళ్ళరా ఏంటి… బ్యాంకులకు  డబ్బులు రావాల వద్దా ఇలా అతనిని వెన్నంటి దొంగగారూ అదే అదే దొంగ దొంగ అంటే పాపం హర్ట్ అయి బ్యాంకులకి డబ్బులకి కట్టకపోతే ఆ పాపం ఎవరిదీ? ఆలోచించండి పాపం అతనిని అలా వదిలేయకండి… కాస్త పట్టించుకోండి  అంటూ  నేటిజన్స్  వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. పాపం మాల్యా పాంచాల పరాభవం లా ఫీల్ అయి స్టేడియం వదిలేసి వెళ్ళిపోయారు. ప్చ్! అని నిట్టూర్పులు విడుస్తున్నారు ప్రత్యక్ష సాక్ష్లులు

వార్త: ఆంధ్రజ్యోతి

రమణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *