Views:
236

బుల్లితెర యువ యాంకర్, మాటల గారడీ చేసి కొంచం టచ్ లో ఉంటె చెప్తా అంటూ సినీ నటులని మెప్పించే యాంకర్ ప్రదీప్ అరెస్ట్ అయ్యారన్న వార్తా మీడియారంగంలో సంచలనం రేపింది. అభిమానులు అసలేమి జరిగింది అని ఆందోళన పడుతున్నారు

తాజాగా సీనియర్   నటుల నోటి దురుసు కారణంగా కేసులు , అరెస్ట్లు, యాంకర్లని ఆయా కార్యక్రమాలనుండి తొలగించడం నేపధ్యంలో సినీవర్గాలు ఆందోళన చెందుతూ  ఉన్న సందర్భంలో నిన్న అనగా శుక్రవారం ఎర్రమంజిల్ పోలీసులు యువ యాంకర్ ప్రదీప్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం ఒక సంచలనం సృష్టించింది అనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే.. చెక్ బౌన్స్ కేసులో ప్రదీప్‌ను శుక్రవారం ఎర్రమంజిల్ కోర్టు రిమాండ్ తరలిస్తూ తీర్పు చెప్పినట్టు తెలిసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రదీప్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు

అయితే అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం   లేదని  ప్రదీప్ కి    దగ్గరయిన సినీ ప్రముఖుల   సహాయంతో ఆరోజే బెయిల్ పై తిరిగి రావడం కూడా జరిగిందని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి.,  ఎదే మయినా   తమ అభిమాన యాంకర్ ప్రదీప్    జైలు కెళ్ళాడన్న   తాము తట్టుకోలేకపోయామని కొందరు  కాలేజ్ అమ్మాయిలు అభిమానులు వెల్లడించారు. అవునుమరి బుల్లి తెరపై ఉన్న కొద్దిమంది హుందా ప్రవర్తన కల    యాం కర్లలో ప్రదీప్ ఒకరు. బుల్లితెర ప్రభాస్ గా అభిమానిస్తారు కాలేజ్ అమ్మాయిలు. కాస్త ఆందోళన చెందినా కథ సుఖాంతం !

సౌజన్యం:ఫిల్మీ   బీట్స్

  • రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *