Views:
21

వర్మ తీసిన మొదటి షార్ట్ ఫిలిం అంటూ మగవాళ్ళ ఆదరణ , మగువల కోపానికి గురి అయిన నా కూతురు సన్నిలియోన్ అవుదామనుకుంటోంది,     ఆడపిల్లల్ల జీవితాల్లోకి చొచ్చుకుపోయింది. సినిమాని కొంచం లోతుగా ఆలోచించండి , అమ్మాయిలని  కొంచం లోతుగా ఆలోచింపజేసి, వాళ్ళ పరిణితి ని ఇనుమడింపజేసే సినిమా, ఆడవాళ్ళ భావ స్వేచ్చకి మచ్చు తునక, అంటూ కొంతమంది నవ యువత, నవసమాజ నిర్మాణ ఉన్నత ఆలోచనల యువత ఇంకొంచం ఆలోచించమని అడుగుతుంటే….. అరెరే ఈ వ్యాపారమేదో బాగుందే ఆచరణలో పెట్టేసింది ఈ అమ్మడు. ఓ కారు, ఓ ఫ్లాటు కొనుక్కోవాలని భావించిన ఓ 19 ఏళ్ల యువతి ఉహించని నిర్ణయం తీసుకుంది. తన శీలాన్ని అమ్మేసి తన కోర్కెలను తీర్చుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఓ ఆన్‌లైన్ ప్రకటన ఇచ్చింది. ‘ శీలవతి నిన్ను కోరుకుంటోంది, సిడ్నీ నగరం’ అనే పేరుతో ప్రకటన ఇచ్చింది. కోటి 60 లక్షల రూపాయలు చెల్లిస్తే శీలాన్ని అమ్మేస్తానని ప్రకటనలో వెల్లడించింది. కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. కస్టమర్‌కు నచ్చిన రెస్టారెంటుకు తీసుకెళ్లవచ్చునని, వీడియో చిత్రీకరించకూడదని, ఎటువంటి హింసకు పాల్పడకూడదని స్పష్టం చేసింది. మొహం కనిపించిన కొన్ని  అర్థనగ్న ఫోటోలను పోస్టుచేసింది.

అదీ వర్మ సినిమా మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా ఆదర్శంగా తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాదు కాదు  పరిణితి చెందుతున్నారు/ చెందారు. ఇలా అమ్మాయిలు ఉన్నతంగా ఆలోచించుకుని ప్రపంచాన్ని అరచేతిలో ఉంచుకుని పక్కిల్లు, ఎదురిల్లు, అని బేధం లేకుండా ఎంచక్కా…. అందరూ   మనవాళ్ళ లాగా,  మన ఇల్లు లాగా సంతోషంగా ఉండచ్చు. విలువలన్నీ వలువల్లా అమ్మేసి.  ఏది ఏమయినా వర్మగారి కల ఫలిస్తోంది.  అబ్బాయిలకి ఇక పండగే…

news source: ఆంధ్ర జ్యోతి

న్యూస్ పై అభిప్రాయం : రమణి    రాచపూడి

One thought on “ఈ అమ్మాయి చాలా ముదురు – వర్మ పూని ఉంటాడు”

  1. అదీ సంగతి… కొంతమంది యువకులు ముందు తరం దూతలు పావన నవజీవన నిర్మాతలు , మాలాంటి పుట్టుకతో వృద్దులని పక్కకి పెట్టి నవసమాజం కోసం నవ జీవనం సాగిస్తూ అమ్మాయిలు ఎంచక్కా శీలాన్ని నడి బజార్లో అమ్ముకుంటూ….. నాటి రాయల కాలంలో అంగట్లో రత్నాలు అమ్మినారట ఇచట అన్నట్లుగా తరువాతి తరాలవారందరూ గొప్పగా అంగట్లో స్త్రీత్వాన్ని అమ్మినారట ఇచట అని పాడుకోవచ్చు…. కానివ్వండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *