Views:
20

మీడియా ట్రెండ్ ..

ప్లాస్టిక్ బియ్యం పై మీ చానల్స్ లో స్టొరీ లుబాగున్నాయి
థాంక్స్
ఓ వారం క్రితం కొత్త పేట లో ప్లాస్టిక్ బియ్యం ఆముతున్నారని నిలదీయడం షాప్ వాళ్ళు దాడి చేసి కొట్టినట్టు వార్తలు..అరెస్ట్ చేసి నట్టు..బియ్యం ను పరీక్షకు పంపినట్టు వార్తలు వచ్చాయి .
అవును ఆ వార్త కూడా మా చానల్ లొనే అదిరిపోయింది….
నిజమే పరీక్షకు పంపిన బియ్యం సంగతి ఏమయింది…అవి ప్లాస్టిక్ బియ్యమే అని తేలిందా ?లేక ఉట్టి అనుమానం అని తేలిందా ?ఎం జరిగిందో చెప్పాలి కదా?
మీరు మరి చెబుతారు..ఆ ఒక్క విషయం చెబితే ఇక వార్త ఏముంది.ఇప్పడైతే ఓ మూడు రోజులు సంచన ల వార్తలు చూపించ వచ్చు…..

క్రెడిట్ : మురళి బుద్ధ

-రమణి

5 thoughts on “ఆ.. చెప్పెస్తామండి.. రా రమ్మనమని…”

  1. బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారన్నిది పూర్తిగా అవాస్తవం. బియ్యంను పోలినట్లుండే (బియం సైజులో) ప్లాట్టిక్ ముక్కలు తయారయ్యే మాట వాస్తవం. వాటిని వివిధ ప్లాస్టిక్ పోగుల తయారీకి వినియోగిస్తారు. అంతేకానీ బియ్యంలో కలిపేందుకు కాదు. మనం వాడే బాస్మతి బియ్యం కంటే కూడా తూకంలో వాటివిలువ మూడు రెట్లు ఎక్కవగా ఉంటుంది. ఏ కల్తీ వ్యాపారి అయినా ముూడంతలు ఎక్కవ ఖరీదైన వాటిని కల్తీ చేస్తాడా? ఇలాంటి పుకార్లను నమ్మకండి. నిన్న సాక్షి ఛానల్ లో దీనిపై పోలీసులు, సంబంధిత రంగ నిపుణులు పూర్తి క్లారిటీ ఇచ్చి ఇది అవాస్తవమని తేల్చారు..

  2. బియ్యం రేటుకి అయి ఎక్కడ దొరకతాయో చెప్పండి హోల్ సేల్ గా ఓ పది క్వింటాల్స్ కొనుక్కుంటా.

  3. మా సెంద్రన్నం నిజం చెప్పాడన్నట్టుంది ఈ పుకారు

  4. ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ ఏడ్పులు, ప్లాస్టిక్ బ్రతుకులు ఇవి చాలదా ప్లాస్టిక్ బియ్యమెందుకు?

  5. ప్లాస్టిక్ క్యాబేజీలు మా షోకేస్ లో వున్నాయి ఎవరి చెవులోనైనా పెట్టండి. ఎవరైనా గిట్టుబాటు కానివి కల్తీ చేస్తారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *